ఈ పుట అచ్చుదిద్దబడ్డది

16

తెలుగుమెఱుఁగులు

16

పండ్లు పండి, ఆ పండ్లగింజలను మరల నాటి అవి పెరిగి పండ్లు పండుటకు, వాని ననుభవించుటకు మనుష్యుడు దీర్ఘాయుష్మంతుఁడు కావలెను. మంచిపంటలు పండని, నీటివసతి లేని యెగుడుదిగుడు నేలలుకూడ తాటితోఁపులకు పనికివచ్చును. నాటిన తాటిమొలకలకు నీళ్లు పోయనక్కఱలేదు. మొక్క లెదుగుదాఁకనైన కాపుకాయ నక్కఱలేదు. తక్కువ నేలలోనే దగ్గఱదగ్గరగా ఎక్కువ మొక్కలు నాటవచ్చును. విత్తనము నాటినది మొదలుగా కాపుపట్టినదాఁకకూడ వానికే ధనవ్యయము ఏమియు చేయనక్కఱలేదు. నాటిన తర్వాత రెండు మూఁడేండ్ల నుండి ఆకులు, మట్టలు మొదలగువానివలన నుపయోగము లుండును. పూర్వకాలమున నొక గృహస్థుఁడు కొన్ని తాటి చెట్లు కలవాఁడైతే కట్టుబట్టతప్ప తక్కిన జీవితావశ్యకవస్తువు లన్నియు తాటిచెట్లనుండి సేకరించుకొని జీవయాత్ర గడపుకోగలుగువాఁడు. కాపురమునకు నిట్రాడుగుడిసె వేసికొన్నచో తాడి దూలము నిట్రాడవును! గోడలు పెట్టి కట్టు ఇల్లుయినచో తనాబీలు, దూలములు, స్తంభములు, కొమరులు, గుజ్జులు, వాసాలు, పెండెలు అన్నింటికి తాటిమ్రాను పనికివచ్చును. పై కప్పుకు తాటియాకులు పనికివచ్చును, కట్లు కట్టుటకు తాటినార పనికివచ్చును. ఇంట పఱచుకొనుటకు తాటియాకు చాపలు, సామానులు నిలువచేసికొనుటకు నానారకాల పెట్టెలు, బుట్టలు తాటియాకులతో చేయవచ్చును. నీళ్లు చేఁదుకొనుటకు తాటియాకుతో బొక్కెనలను చేయవచ్చును. తాటినార చేత్రాళ్లు మొదలగు త్రాళ్లు పేనుట కుపయోగపడును. తాటి మ్రాకులను రెండుగా చీల్చి నీళ్లు పాఱుటకు దోనెలుగా చేయవచ్చును. ఈ నెలు తీసి కోసి కుట్టిన యాకులు విస్తళ్ళుగా సుపయోగింపవచ్చును. తాటిముంజెలు. తాడిపండ్లు, తాటి (నిలువచేసిన పేసము) చాప, బుఱజగుంజు, తాటి