ఈ పుట అచ్చుదిద్దబడ్డది

6

తెలుగుమెఱుంగులు


టాటవెలఁదులు తెలుఁగువారికి నిస్సామాన్య సాహిత్య భాండాగారములు. తెలుఁగువారి భక్తిమయ జీవితమునకు పోతరాజు, త్యాగరాజు, గోపరాజులు జీవగడ్డ లయిన త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులలో కడపటి యిద్దఱి గేయములు తెలుఁగువారి కమృతధారలు. తెలుఁగు కవులలో ప్రాచీనులు కొందఱు తెలుఁగుదేశము యొక్కయు, తెలుఁగు ప్రజల యొక్కయు విశిష్టతను వర్ణించిరి. ప్రధానముగా శ్రీనాథుఁడు కాశీ, భీమఖండములలోను, జక్కన విక్రమార్క చరిత్రలోను, సోమనాథుఁడు పండితారాధ్య చరిత్రలోను, అజ్జరపు పేరయ ఉడయనంబి విలాసములోను ఆంధ్రదేశ సౌభాగ్యమును వర్ణించినారు అజ్జరపు పేరయకవి ఉడయనంబి విలాసములో ఆంధ్ర ప్రజలనుగూర్చి వర్ణించిన వర్ణనలే కొన్ని యిప్పుడు వినిపించుచున్నాను -


 “భామ విను శ్రీమదాంధ్రభూభాగమనెడు
తారహారంబునకు సొంపు దనరుచున్న
మధ్యమణిచందమున మహామహిమ దాల్చే
భూరివిభవంబు బెజవాడపురవరంబు.
క్రొత్త బియ్యము థాయగూర లొబ్బట్లు సై
దంపు బూరెలు పంచదార తాలలు
వడలు నల్లంబు మీఁగడల తియ్యని పెర్గు
కమ్మని నీరివాలు గసగసాలు
చిఱుసెన్గపప్పును తఱచు వీడ్యంబులు
కంబళ్లు నంబళ్లు కంచుకములు
ఇంగువ జిలకట్టు నెనసిన మిరియంబు
మంచివాసన నెయ్యి మాటదురుసు