ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

163


దివ్యధ్వని-అను పదమును 'దివ్య వని' అని వ్రాయ వలెను. రెండిటికంటే హెచ్చుగా హల్లులు సంయుక్తములై యున్నప్పుడు మాత్రము, కడపటి హల్లుగాక తత్పూర్వపు హల్లులు, తలకట్టు లేనివిగా నుండునుగాన, ఒక దాని క్రింద నొక దానిని బెట్టినను బెట్టవచ్చును. ఎట్లనఁగా - వ్స్క్యావాతంత్ర్య అను పదము 'వాక్సవాతంత్ర య' అని వ్రాయవచ్చును. ఇట్టి మార్పువలన బాలురకు హల్గుణితపు ఒత్తును నేర్చుకొనవలసిన శ్రమము తొలఁగును. ఉచ్చారణరీతి ననుసరించి లిపిరీతిని నేర్చుకొనుట యగును.


ముద్రణమున నీ మార్పు బహుసుఖావహము. బంతిలో నక్షరము లెల్లఁ దీర్చినట్లుండును. ప్రతిపదము అక్షరము క్రింద నక్షరము వచ్చి బంతి వంకరవోదు. 'హాఫ్ బాడి, ఫుల్ బాడీ' టైపుల గజిబిజి యుండదు. సమ్మతమగుచో రెండింటికంటే నెక్కువ హల్లులు సంయుక్త మైనప్పుడు మాత్రమే తలకట్టు లేని హల్లులు అక్షరము క్రింద నక్షరముగా నేర్పడును. అది యసాధారణముగా నెక్కడనో వచ్చును.కాన యంతచిక్కుండదు. కానియిక్కడ ససౌకర్యమువలెఁ దోఁచఁదఁగిన విషయ మొక్కటి యున్నది.ఏదనంగా - సంయుక్తాక్షరములు హల్లు క్రింద హల్లుగాఁ గాకుండ ప్రక్కప్రక్కగాఁ గూర్చుటచేత నిప్పటి లిపిఆక్రమించుకొను స్థలముకంటే నీ మార్పు లిపి హెచ్చుస్థల మాక్రమించుకొనునుగదా అనునది. ఇది యోచింపఁదగినదే. ఒకానొక యాంగ్లాభిమాని ప్రముఖుఁడు ఆంధ్రలిపిని దొలఁగించి తత్ స్థానమున నాంగ్లలషిని చొప్పింతుమేని నూఱుపుట లాక్రమించుకొనుగ్రంధమును ఏఁబదిపుటలలో సమకూర్పు వచ్చు నని కొన్ని యేండ్ల క్రిందట వాదించుట వింటిని. ఇంగ్లీషక్షరములు బెక్కక్షరములను గూర్పనగు ననియా లిపిజ్ను లనిరి. అట్లు తలఁచువా రుండఁగా నే నిపుడు పేర్కొను లిపి సంస్కారము ఇప్పటి లిపి కంటే హెచ్చుస్థల