ఈ పుట అచ్చుదిద్దబడ్డది

152

తెలుగుమెఱుంగులు


అది లేదు. దీనితర్వాతివర్గానునాసికము లగున, మ లకును నాచిహ్నము లేదు. తవర్గమున త మాత్రము భిన్నమై, తర్వాతి మూఁడక్షరములగు థదధలు పోలిక గలిగియున్నవి. స-స-తోఁబోలిక గలది. పవర్గమున పఫలు, బభలును బోలియున్నవిగాని - బకుఁగొమ్ము ముడ్డి క్రింద ఈయవలసెను. వఫలకుఁగూడఁ గొమ్మిచ్చుటలో నిట్టి చిక్కె కలదు. య కొమ్ముగలది. ర ఱ లు. లళ లు, శష లు పోలిక లేనివిగా నున్నవి. స న-తోఁ బోలిక గలది, హవతోఁ బోలికగలది. ఉచ్చారణమునఁ బోలిక యుండుటనుబట్టి లిపిలోఁ గూడబోలిక యుండఁదగినయక్షరములు క ఖ లు, గ ఘ లు, జఝు లు. టర లు, తథ లు, రఱ లు, శషస లు, పోలిక లేనివై, పూర్వోక్ష విధమున నుచ్చారణమున నేమాత్రమును బోలిక లేని యక్షరములు గొన్ని పోలికగలవై యుండుట చేతను, వర్గాక్షరాదులు సరియయిన నిర్మాణక్రమము లేనివిగా నుండుటచేతను బాలురకు లిపిని నేర్పుటలో మిక్కిలి చిక్కుగలదు. చ-కు ముద్దిక్రింద ఒత్తిచ్చినచో ఛ అగునని చెప్పుటకు వీలులేదు. క ఖ, ట ఠ, తథ, లు అట్లులేవు గాన సాహిత్యబోధము కుదురదు. ఇంత వరుసవావి లేని లిపి రూపములను భిన్నభిన్నముగా నేర్చుకొన కష్టమే కాదా? మఱియు నివిగాక అజ్ఞుణితము వేఱు చిహ్నములతో నేర్చుకొనవలెను. హల్గుణితము వేఱుచిహ్నములతో నేర్చుకొనవలెను. ఈ గుణితములలో (గూడఁ బెక్కుచిక్కులు గలవు. ఇవి కొంత ఉచ్చారణరీతికి విరుద్ధముగాఁగూడ నున్నవి. హల్లుపై అజ్ఞుణితమును జేర్చునప్పుడు తలకట్టు అకార మున్నప్పుడు మాత్రమే ఉండఁదగును. తక్కినయచ్చులు చేరునప్పు డుండఁ గూడదు. క, కా, కి, కీలు సరిగా నున్నవీ కానీ, కు కూలు తప్పుగా నున్నవి. తలకట్టు, కొమ్ము రెండును ఉండఁగూడదు. ' కృ కృ' లకును