ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

121


ప్రాంతప్రతిలో సున్న 'ఆహివెట్టు' ప్రయోగము సరికా దన్న యపనమ్మకము నాకు లేదు. కాన దానిని నే దిద్దలేదు. 'ఆధీ' పద మొకటి 'తాకట్టు' అర్థముగలది ఉన్నంతమాత్రాన 'ఆహి' ఉండ దనవుచ్చునా?,

గౌరన హరిశ్చంద్రోపాఖ్యానమున ఎల్లవ్రాతప్రతులలో 'ఆహికంబులు పెట్టి' అన్నప్రయోగము గానవచ్చు చున్నది- “ఆహికంబులు పెట్టి యవి దక్కుమితులు సాహసంబునఁ బల్కి (చూ. ఉత్తరభాగము). బ్రౌనుదొర గారిపండితులు ఇందు 'తాకట్టు పెట్టి' అని యర్ధము వ్రాసిరి. తేవప్పె రుమాళ్లయ్యగారు వ్రాతప్రతులను, బ్రౌనుదొరగారు వ్రాయించిన టీకను బరిశీలించి 'ఆహికము' తాకట్టు అనువర్ధముతో ప్రకటించిరి (చూ. 194 పుట). పిదప శ్రీవేంకటరాయ శాస్త్రులుగారు మరల నాగ్రంథమును బ్రకటించుటలో ఆహికము శబ్దరత్నాకరాదినిఘంటూధృతము గాకుండుటచేఁగాఁబోలును “ఆహితము' అని దిద్దిరి (చూ. 151 పుట), తాకట్టు అనియే యర్థము వ్రాసిరి. ఆ పాఠము ప్రాంతప్రతులలో లేదు. తెలుఁగున 'ఆయకము' అను పదము తాకట్టు అనుసర్థమున వ్యవహారమునం గలదు. 'ఆయకము' రూపాంతరము 'ఆహకము' అని యుండునని కాఁబోలును బ్రౌను, సీతారామాచార్యులు తమ నిఘంటువులలో గౌరన ప్రయోగమును 'ఆహకముగా గ్రహించిరి. కాంతప్రతులలో లేని 'ఆహకము' రూపము గ్రాహ్యముకాదు. గౌరన నవనాథచరిత్రమునఁగూడ 'ఆహికము' కలదు- ఆహికంబులు పెట్టి యప్పులు వార, వృద్ధి కొసంగుదు..' (చూ. 153 పుట), ఆహి, ఆహికము రూపభేదములు కాఁ బోలును. ఆహిపదప్రయోగము ఇంత సాధకసామగ్రి కలది. శ్రీనాథ ప్రయుక్తమయిన యీ 'ఆహి' ప్రయోగము విడనాడి యీ యర్థమున శ్రీనాథరచనముల నారగించి, జీర్ణించుకొని, కవితాబలము గడించినవాఁడు