ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుంగుమెఱుంగులు

117


పాఠ్యాగమసూక్తపంక్తి

“ఈ పాండిత్యము నీకుఁదక్క మణి యెం దేఁగంటిమే కామశా
సోపాధ్యాయివి సా వచించెదవు మే లోహో త్రయీధర్మముల్
పాపంబుల్, రతీ పుణ్యమంచు నిఁక నే లా తర్కముల్ మోక్షల
క్ష్మీపథ్యాగమసూత్ర పంక్తి కివెపో మీ సంప్రదాయార్ధముల్."

అన్నాఁడు. ఈ పద్యమున "మోక్షలక్ష్మీ పాఠ్యాగమ సూక్త (త్ర) పంక్తి కివివో మీ సంప్రదాయార్ధముల్". అన్న పాఠము సుందరము. మోక్షలక్ష్మిని (అచ్చరపూఁబోఁడినికాదు) బడయుటకుగాను పాఠ్యమయిన యుపనిషన్మంత్ర క్రమమునకు మీ సంప్రదాయమువారు (తృతీయపురుషార్ధమే పరమార్ధ మను వారు) చెప్పెడు నర్ధ మిట్టిదియా యనుట నేఁజూపిన పాఠమున కర్ధము.

కృష్ణదేవుఁడు గాదు, బాలకృష్ణుఁడు

తెలుఁగు సకలకథాసారసంగ్రహము అయ్యలురాజు రామభద్ర విరచితము "శ్రీకృష్ణదేవరాయ ప్రేరణమున తదంకితముగా రచితమయ్యె" అని వెనుక నొకప్పుడు వ్రాసితిని. అది కృష్ణరాయప్రేరణముననే రచింప బడెనుగాని శ్రీకృష్ణదేవరాయనికిఁగాక శ్రీకృష్ణదేవుని కంకితము సేయఁ బడినది. అం దిట్లు గలదు.

"కనకవస్త్రంబు గల మృదుతనువువాఁడు
భర్మనూపురయుతవదాబ్దములవాఁడు
మీంచి వేదాంతముల సంచరించువాఁడు
ప్రౌడి శ్రీకృష్ణుఁడను పేరఁబరగువాఁడు”.

మదీయభాగ్యవశంబున స్వప్నకాలంబునఁ బ్రసన్నుండై పరమ మంత్రోపదేశపూర్వకంబుగా సకలకథాసారసంగ్రహంబునకుఁ గృతి నాయకునిఁ గావింపుమని హితోపదేశంబు చేసి యంతర్షితుం డయ్యె!.