ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుభాశయము భూమన్, సంచాలకులు, ఎస్.వి. ఉద్యోగుల శిక్షణ కేంద్రము. ఎస్. వి. కేంద్ర గ్రంధాలయము & పరిశోధన సంస్థ. క్రైవేటూరి ప్రభాకరశాస్త్రి వాకుడు పేరము. సూర్య శ్రీ తరిగొండ వెంగమాంబ చాట్యుయ ప్రాజెక్టు. చేత భవనము, తి తి దేవస్థానములు, కరపతి,

తిరుమల తిరుపతి దేవస్థానం గొప్ప ధార్మిక సంస్థ. సాహిత్యం, భక్తి సంగీతం, ఆధ్యాత్మికం, ధార్మికప్రచారం, కళ్యాణమస్తు, శాంతియాగాలు. దళిత గోవిందం, అర్చకపునశ్చరణ తరగతులు - ఇలా ఎన్నో విధాలుగా ప్రచార సేవలు అందిస్తూ, సమాజాన్ని ధార్మిక చింతనమార్గంరలోకి తేవడానికి అహర్నిశలు కృషి చేస్తుంది. ఎంత చేసినా ఎంకా చేయాల్సింది ఎంతో వుందనే తోస్తూంది.

ఈ శుభాశయంతో ఇటీవల క్రొత్తగా "శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీరాన్ని "శ్వేత" లో స్థాపించడం జరిగింది. ప్రభాకరశాస్త్రిగారు సుప్రసిద్ధకవి పండితులు. గొప్ప విమర్శకులు, సరంతర సాహితీపరిశోధకులు. తిరుమల తిరుపతి దేవస్థానంతో శాస్త్రిగారికి ఎంతో అనుబంధం ఉంది. పీరాన్ని స్థాపించకమునుపే చేటూరివారి వర్ధంతిని నిర్వహించటం జరిగింది. పీరాన్ని స్థాపించిన వెంటనే శ్రీశాస్త్రిగారి 120 వ జయంతి రావడం, ఈ సందర్భంగా శాస్త్రిగారి ఆలభ్య పుస్తకాలను నాల్గింటిని సింహవలోకనం, ప్రజా ప్రభాకరం, తెలుగు మెఱుగులు, మీగడతఱగలు" పునర్ముద్రించి, సాహితీ ప్రియులకు అందించడం ఆనందంగా ఉంది శ్రీ శాస్త్రిగారి 120 వ జయంతి సందర్భాన 'శ్వేత' భవనం ఎదురుగా - వారి కాంస్య విగ్రహాన్ని స్థాపించడమూ గొప్పస్తూర్తి దాయకం! శ్రీశాస్త్రిగారి అలభ్య, అముద్రతరచనలను ముద్రించడం, వారి సాహిత్యలపై పరిశోధనలు గావించడం, వారు వ్యాఖ్యానించిన "ఉత్తర హరివంశాన్ని (అసమగ్రం) సుప్రసిద్ధ పండితులతో పూర్తి చేయించడం, మున్నగు కార్యక్రమాలతో పీఠం నానాటికీ విస్తృత చుచ్చుతుందని ఆకాంక్ష.