ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"శ్రీవేంకటేశ చరణ్ శరణం ప్రపద్యే " నామాట 28.01.2018. 3.వి. రమణాచారి, ఐ.ఏ.ఎస్., కార్యనిర్వహణాధికారి, తి.తి. దేవస్థానములు, తిరుపతి,

తిరుమల తిరుపతి దేవస్థానములవారు చేపట్టిన ప్రజాకత కార్యక్రమాలు ప్రజల్లో ఎంతో భక్తి ధార్మిక చైతన్యాన్ని కల్గిస్తున్నాయి. శ్రీవారి యందు అచంచల భక్తినీ, ప్రగాఢ విశ్వాసాన్నీ దృఢతరం చేస్తున్నాయి. వీటికితోడూ ప్రాచీన సాహిత్యంలో ఆణిముత్యాలైన రామాయణ భారత భాగవతాది గ్రంథాలను సరళసులభ వివరణాత్మకంగా ప్రజలకు అందిస్తున్నారు.

ఏ దేశంలో ఉత్తమసాహిత్యం విశేషంగా వ్యాప్తి జెంది, ప్రజా హృదయాల్లో చెరగని ముద్ర వేస్తుందో, ఆ దేశంలో ధార్మికసంస్కృతి, నాగరికత,జ్ఞానం, భక్తి, ఆధ్యాత్మిక చింతన. సౌభ్రాత్రం. సౌశీల్యం, సుఖశాంతులూ వర్ధిల్లుతాయి. సంసారం సంస్కారంతో రాణిస్తుంది. ఈ దిశలో భాగంగా దేవస్థానంవారు "శ్రీమాన్ వేటూరి ప్రభాకరశాస్త్రి వాజ్మయపీఠాన్ని "శ్వేత" లో స్థాపించారు. ఈ పీఠం శ్రీశాస్త్రి గారి రచనలనూ, పరిష్కరణలనూ, సాహిత్యజ్ఞులకు సన్నిహితం చేయడమే కాకుండా ఉత్తమపరిశోధనలూ జరిపించి, అనేక నూతనాంశాలు - సమాజ శ్రేయోదాయకమైనవి వెల్వరించా లసీ ఆశిస్తున్నాము. -