ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తెలుఁగుమెఱుంగులు

91


మారి యుఱుకంగ' అని పదచ్ఛేదమా, 'పానంబు సేయఁ-గనుమారి యులుకంగ' అని పదచ్ఛేదమా అని సంశయము. ఈ సంశయము నీక్రింది నాచనసోముని పద్యము తీర్చినది.

“పాయఁదగు మీమ్ముఁ గసుమారిఁ బడఁ బొసంగు
విషముఁ ద్రోవుట యోగ్యంబు వెల్లిలోన
ముసుఁగు టుఛితము మీ రెల్ల కనుఁగొనంగ
నాత్మవిడుచుట చను నాకు ననుచు నడలి. "

(ఉత్తరహరి. అ.4)

పదము కనుమారిఁబడుట' యగుట స్పష్టము. 'కనుమారిఁ బడుట'కు భృగుపతన' మర్ధము. శాంతిపద్యమునకు మూల మిది:

"సురాపానం సక్మత్ కృత్వా యో. .గ్ని వర్ణాం సురాం పి బేత్
మరుప్రపాతం ప్రపతన్, జ్వలనం హి సమావిశన్,
మహాప్రస్థాన మాతిష్ఠన్ ముచ్యతే సర్వకిల్పి పైః,"

(శాంతి, ఆ.34)

“మరుప్రపాతమ్ = నిర్జలదేశ పర్వతాగ్రాత్ పతనమ్) అని ప్యాఖ్య- శ్రీశైలముపై కర్మారీశ్వర మని యొక పుణ్యస్థల మున్నది. అది కొండకొమ్ము:. అక్కడనుండి భక్తులు పుణ్యలోకప్రాప్త్యర్ధమై నేల కుఱికి ప్రాణత్యాగము చేయుదురు. క్రిందఁ బడుచున్నవాఁడు, అంతరాళమున నున్నవాఁడు, ఉఱుక నున్నవాఁడు అన్న క్రమమున ఎడతెడకుండ శివరాత్రినాఁ డక్కడ భక్తులు ఉఱుకుచునే యుండెడివారు.

"కరమర్ధిఁ జేసి యా కర్మారీ నుఱుకు
ననఘుల భవపరిత్యక్త మానసుల
నఱిముఱి నవలి కర్మారీశ్వరమున
సులకు పుణ్యులఁ జూచి
పడియెడు దేహంబు పడిన దేహంబు
నడిమి దేహంబు లెన్నంగఁ టెక్కాడు"

(పండితారాధ్య చరిత్ర)