ఈ పుట అచ్చుదిద్దబడ్డది

90

తెలుఁగుమెఱుంగులు


శబ్దత్నాకరకారు లీపద్యము సుదాహరించి 'చందమామ గ్రుక్కిళ్లు' అనుపదమును 'అధరామృతము' అని యర్థము వ్రాసిరి. కాని, వారే అక్కడ "ఇట్లు, చందమామగుటకలు, ఈ యర్ధ మింకను విచార్యము" అని వ్రాసిరి, అధరామృత మన్న యర్థము సంగతముగాదు.


-1. కేనము


'కేసము = అసూయ మొదలగు నర్థములందు నన్నిచోడఁ డుపయో గించెను 'కేణ' క్రొత్తకన్నడముననే కలదు గాని ప్రాచీనకావ్యములలోఁ గానరాదు. కావునఁ దత్రయోగముగావించిన కవి ద్వాదశశతాబ్దికంటెఁ బ్రాచీనతరుఁడు గాఁజాలదు." అని శ్రీ లక్ష్మీపతిశాస్త్రిగారు. నన్నయ భట్టారకునకు నూడేండ్లపూర్వపువాఁడును, కర్ణాటప్రాచీన మహాకవియు నగుపంపకవి తన విక్రమార్జునవిజయమున 'కేణ' పదమును పదవయాశ్వాసము 77వ, 81వ, పద్యములందు రెండు చోట్ల నన్ని చోడఁ డేయర్థమునఁ బ్రయోగించెనో ఆ యర్ధముననే ప్రయోగించెను. కాన ఇది యాంధ్రకర్ణాటకవితల యాదికాలముననుండియు రెండు భాషలలో వ్యవహృత మగుచున్న పదమే యని తెలియనగును.

-3. కనుమారి


భారత శాంతిపర్వము (ఆశ్వా.1. ప.307) న -
"కల్లు ద్రావిన పాతకం బది యగ్నివ
ర్ణముగాఁగఁగాఁచి పానంబు సేయం
గనుమారియులుకంగ ననలంబుఁజొర మహా
ప్రస్థాన మాచరింపంగఁ బాయు. "


అని కలదు, ఇందు 'కనుమూసి యుఱుకంగ' అని పాఠాంతర మున్నది. అది పరిగ్రాహ్యము గాదు. ఇక్కడ 'పానంబు సేయఁగను-