ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మాస్టరు సి.వి.వి" యోగాన్ని సాధించి, ఆశ్రయించిన వారి శారీరక, మానసిక వ్యాధుల్ని పోగొట్టి, ధనాపేక్ష లేకుండా గొప్ప వైద్య సేవలందించారు.


గ్రంథరచన, విమర్శలు, పఠనం, పాఠనం, తాళపత్ర గ్రంథాలు సేకరణ, పరిశీలన, అనేక ప్రాచీన శిల్పాలు సేకరించడం, - ఇలా అనేక కోణాల్లో జగమెరిగిన ఉత్తమకవిపండితులు - శ్రీశాస్త్రిగారు. వీరి విమర్శలు నిష్పాక్షికంగానూ, సశాస్త్రీయంగానూ, సునిశితంగానూ ఉంటాయి. తెలియని విషయాన్ని తెలియ'దని ధైర్యంగా చెప్పే సహృదయపండితుల్లో శాస్త్రిగారు అగ్రగణ్యులు,


శ్రీ శాస్త్రిగారి 120వ జయంతి సందర్భంగా {07-12-2008) వీరి రచనల్లో కొన్నింటిని పునర్ముద్రించి, సాహితీలోకానికి అందిస్తున్నాము.. ప్రస్తుతం “తెలుగు వెఱుగులు". "మీగడతఱకలు". "ప్రజా ప్రభాకరము", సింహావలోకనము" ఆనే నాల్గు పుస్తకాలు ప్రచురిస్తున్నాము. వీటిలో "ప్రజా ప్రభాకరం" యోగానికి సంబంధించింది. తక్కినవి ఆంధ్రసాహిత్యానికి సంబంధించిన వ్యాసరత్నాలు. నన్నయనుండి చిన్నయ వరకూ గల సాహిత్యాన్ని ఆపోశనం పట్టిన శాస్త్రిగారి ఈ వ్యాసాలు సాహితీ విద్యార్థులకు ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు - వారిలో కొత్త ఆలోచనలకూ, విమర్శనధోరణికి బాటలు వేస్తాయి. ప్రాచీన సాహిత్యంపై అభిరుచిని కలిగిస్తాయి.

సాహితీ ప్రియులు మా యీ కృషిని అభినందిస్తారనీ, ఆదరిస్తారనీ - శ్రీశాస్త్రిగారి వాజ్మయ పీఠం ద్వారా ఉత్తమపరిశోధనలు వెల్వరిస్తారనీ అక్షాంక్షిస్తున్నాను.


"శ్రీ వేంకటేశచరణ్ శరణం ప్రపద్యే " శ్రీవారి సేవలో,

(భూమన కరుణాకరరెడ్డి)