పుట:Telugu bala Satakam PDF File.pdf/24

ఈ పుట ఆమోదించబడ్డది

97. మాతృభాష నేడు మాకు రాదని పల్కు జనులు పెరుగు చుండె జగతిలోన 'అమ్మ బాసమరువ నధమాధముండగు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

98. పనికి రాక యెచటొ పదడియున్న రాతిని అందమైన శిల్ప మటుల చెక్కు గురుని మించు శిల్పి గుర్తింప శక్యమే తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

99. అందమైన రూపమధికమ్ము గానున్న గణ్యమైన రీతి కలిమి యున్న విద్య లేక నరుడు వెలుగొంద లేకుండు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

100. అధిక బలము గలుగు నధికుండ నేనంచు లెక్క చేయకున్న చిక్కుగలుగు గడ్డి తాటి చేత గజము బంధితమగు తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

101. గొప్ప వారలైన తప్పులు చేయుట సహజమగును చూడ జగతిలోన తప్పు దిదిద్దుకొనెడి తత్త్వమ్ము మంచిది తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

102. ప్రేమ సుధకు నెలవు ప్రియమైన అమ్మయే సర్వ సద్గుణాల సాక్షి అమ్మ అమ్మ సాటి తెలుపు అమ్మయే అని యెంచి తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


తెలుగు బాల శతకం 23


</poem>