పుట:Telugu bala Satakam PDF File.pdf/19

ఈ పుట ఆమోదించబడ్డది

67. బద్ధకమ్ము విడుము పనులుచేయునపుడు
బద్ధ శత్రువగును బద్దకమ్ము
బద్ధకమ్ము కలుగ బాగుపడడెవడు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

68. అక్షరమ్మునైన ననువుగా నేర్పిన
గురువు ఋణము దీర్చు కొరకు చూడ
వస్తువది లేదు వసుధ పౖ యత్నింప
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

69. కష్ట సమయ మందు కంది పోవగరాదు
పొంగరాదు సుఖము పుట్టినపుడు
కష్టమును సుఖమును గణయించు సమముగా
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

70. ఉన్నకాలమందె ఉత్తమ గుణములు
సంక్రమింప చేసి సాగవలయు
మంచి గుణములెపుడు మహనీయతనుగూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

71. విద్యా నేర్చుకొనుట పెద్దకష్ట మనుచు
తొలగిపోవరాదు తొందరపడి
వజ్రమునకు సాన వన్నెను చేకూర్చు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.

72. ఉత్తమంపు శ్రేణినుత్తీర్ణతంబొంద
మొదటినుండి బాగ చదువ వలయు
ముందు చూపుతోడ ముప్పులు తప్పును
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.


18 తెలుగు బాల శతకం