పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/57

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లో క జ్ఞా న ము;

       ప్రపంచములో సరఫరా అగు తేయాకులో సగభారము హిందూదేశములోనే తయారు అగు చున్నది.
                   ....            ....              ....
  న్యూయార్కులోని గ్రాండు సెంట్రల్ టెర్మినల్ అను రయిలు స్టేషన్ ప్రపంచము లోని అన్ని స్టేషన్ లలో  పెద్దది. ఆ స్టేషన్ కు 47 ప్లాటుఫారాలు ఉన్నవి.
             ....                ....                 ....
   వెలుతురు సెకండుకు 186,000 మైళ్లు ప్రయాణము చేయును.
          ....              ....             ....
   రేడియో 1902 సం|| లో కనుగొనబడింది.
    ....            .....               .....
   బట్టలుకుట్టెడు యంత్రమును 1830 లో ధిమోన్నీర్ అన్ ఫ్రెంచివాడు కనుగొన్నాడు.
         ....             ....        .....
 అప్పుడు పుట్టిన బిడ్డ సాధారణముగ ఇరవై అంగుళముల పొడుగు, ఏడుపౌనుల బరువు ఉండును.
               .....            .....              .....
    ఆంగ్లభాషయొక్క నిఘంటువులలో మిక్కిలి ఎద్దదైన ఆక్సుపర్డు డిక్షనరీలో 5,90,000 పదాలకు అర్ధాలు వివరింపబడ్డవి.
                  .....             .....              .....
   అన్ని ఆకులకు గాలి, వెలుతురు బాగుగా తగులుట కొఱకే చేట్లు తమ కొమ్మలను ప్రక్కలకు పెంచును.
       ......             .....                 .....
      గ్రంధకర్తలు, నటకులు, ఉపాధ్యాయులు, ఎజినీర్లు, డాక్టర్లు వీరు సాధారణ ముగా మిక్కిలి పొడుగుగా ఉండెనీరు. ఫ్యాక్టరీకూలీలు, రోడ్డు (కూలీలు మిక్కిలి పొట్టిగావుంటారు.?).
             .....              .....             .....
    హిందూదేశములో ఎద్దులుచేయుపని, ఆవులు ఇచ్చుపాలు, రెండు కలిసి ఇచ్చుపెంట ఎఱువు రూపాయ్లలో విలువకట్టిన ఏడాదికి 1300 కోట్లు ఉండునని అంచనా వేయబడ్డది.