పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/53

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
       వెంకటగిరిరాజాగారి పట్టాభిషేకము
     శ్రీ  శ్రీ శ్రీరాజా వెలుగోటి సర్వజ్ఞ కుమార కృష్ణయాచేంద్ర బహదురు పంచహజార్ మన్ సబ్ గారు శ్రీ వేంకటగిరిరాజాగారు అక్టోబరు నెల 14-వ తేది (విజయదశమి) మధ్యాహ్నము 12 గంటలకు పట్టాభిషిక్తులయిరి. పట్టాభిషేక కర్యానుక్రమణిక ననుసరించి ఆయాయుత్సవములు అతి వైభవముగా జరుపబడెను.
       ఈ సందర్బమున రాజాసాహెబువారు సంస్థానమునకు రైతులు బాకీపడి యుండు శిస్తు డిక్రీలలో మూడులక్షల రూపాయలు త్రోసివేయుదుమని వాగ్దానము చేసిరి.  ఆకుతోట శిస్తురేట్లను నూటికి 50 వంతునను పసుపుపైరుల శిస్తురేట్లను నూటికి 40 వంతునను తగ్గింతుమని చెప్పిరి.  హరిజనులకు డిక్రీ బాకీలలో నూటికి, 50 వంతులు తగ్గించెదమనియూ, వెంకటగిరి హైస్కూలులోను, నెల్లూరు హైస్కూలు కాలేజీలలోను హరిజనులు జీతములు లేకుండ చదువుకొనుటకు దగిన యేర్పాట్లు చేయుదుమనియు వక్కణించిరి.
                        మైసూరులో అరస్టులు.
     మైసూరు అసెంబ్లీ సభ్యుడును, మైసూరు కాంగ్రెసుసంఘ నియంతయు నగు శ్రీ కే.టి. భాష్యం అయ్యంగారిని మరియొక కాంగ్రెసు వాది యగు తిమ్మారెడ్దిగారిని మైసూరు పోలీసువారు రాజద్రోహపు నేరమునకై అరెస్ఠుచేసిరి. మరల బొంబాయినుంచి వచ్చిన కె.ఎఫ్ నారిమకొగారిని అరెస్టుచేసిరి. కాని వెంటనే వదలిచేసి వారిని మదరాసునకు పంపివైచిరి.
                 చై నా.జపాను యుద్ధము:-
      చైనా జపానుయుద్ధము తీవ్రముగనే సాగుచున్నది. కాని యీ