పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/51

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క ర్ష క ప్ర బో ధ ము.

                       బూదూరు రామానుజులు రెడ్డిగారు

చెమటనోడిచికష్ట జీవనంబొనరించు
      టన్నచోకంట కంబయ్యె నీకు
ములుగఱ్ఱబట్టి నాగలిదున్నునుటన్న
     యవమాన భాజసంబయ్యెనీకు
గ్రామసీమలలోని కాపురంబున్నచో
     తీరనిధు;ఖంబు దెచ్చెనీకు
పల్లెటూరులలోని పద్ధతుల్ ? మనింప
       హేయంబుగా గొచరించెనీకు

కటకటాదురదృష్టంబు కతననేమొ!
వ్యావసాయిక జీవిత పధమునందు!
సంచరింపగ నెగటుపుట్టించెనీకు!
కర్షకా! కర్షకా! యేమికాలమహిమొ||

కలధనంబువ్యయంబు గావించుచుంటయే
      విధ్యుకతమనుచు భావించినావు
పట్టణంబులకెగ బ్రాక్చునుంటయే
      తగినగౌరవమని తలచినావు
దుండగేండ్రహితంబు తోద్రిమ్మరుటజన్మ
      సాఫల్యమనియెంచ సాగినావు
స్థానికసంస్థలలొన కాలిడుటయే
      మర్యాదయన ప్రాలుచూలినావు.

కపటనాగరికంబుతో కలసిమెలసి
భ్రష్టమతినౌచు పెడదారిబట్టినావు!
పూర్ఫవైభవమునె తలపోయనీవు!
కర్షకా! కర్షకా! నీదుకర్మమేమొ||