పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/38

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

న వ యు వ కు డు.

  ఉభయ భాషాప్రవీణ, అయ్యాదొరాచార్య కవి.
 మన యువకుడు మిగులు తెలివిగలవాడు.  చిన్నప్పుడే "అఱవము, తెనుగు" రెండును వ్రాయంజదువ నేర్చినవాడు. తర్వాత గొంచె మింగ్లీషుభాషయు నలవాటు గలిగించుకొనినాడు.  అన్నివిద్యలును గ్రహింపవలయునని యాతని తలంపు.  కాలము చాలదు. కావున నన్నిటియందును నేదేదో కొంచె కొంచెమెఱిగి నాడు.  చేతిపనులు సయితమన్నియు గొంత కొంత చేయబూనినాడు.  ఒక్క పున్నమినాటిరేయి సుమారెనిమిది గంటలకు దన మిత్రులతో గూడి వేశ్యలవాడ లో సంచరించును, చక్కని చందిరక లయిటుచల్లని ట్రీస్ సయిచిన్ నిరైందు పెంపెక్కిన పాల్కడల్ శిదరియిచ్చొటు పుల్లుగనిండెనాదగెకొ మిక్కిలిగాను మన్సుతలై మేలె సుమంబులు కారు మబ్బులొజిక్కిన చుక్కలట్లంరెసీయిదె బోగము లేడి తెర్వులోన్ అని యాంధ్ర ద్రావిడాంగ్లములతో మనోహరముగ వర్ణించి యేకకాలంబున దన త్రిభాషాపాండిత్యమును బ్రకటించినాడు. మిత్రులానందపర వసులై చప్పట్లుగొట్టి గల్లుననవ్విరి.  సంతోషమతిశయించినది. అల్లసాని పెద్దనామత్యునివలె నితరులచేత గవిగండపెండరముం దొడిగించుకొనినాదు  సకల కళాధురీణుండుగావున నతదొకనాడు మిత్రులయెదుట దన సంగీత విద్యా నైపుణ్యముంజూపనెంచి తభురచేబూని శ్రుతియెక్కించి రాగపరీక్ష నెఱింగిన వాడగుటచే మేఘరంజనాలాపము సేయనారంభించినాడు.  చాలసేపు శ్రమపడి నాడు. కాని, యెందులకో నెమిలియొక్కటియైన నచ్చటికిరాదయ్యె "అక్కటా! అమెరికాలో నాంగ్లేయ సంగీత విద్యానిపుణుడొక్కడు 'నా సంగీతమున కానందించి నేను కూర్చుండిన వారధి సైతము కదలె!" నని వ్రాసినాడే.  నాసంగీతమునకట్టి సామర్ధ్యమేల రాదయ్యె" నని చింతించినాడు.  అక్ష విద్యాచతురుండగుటచే నత డొకింతసేపు కాలము గడపనెంచి మిత్రులతో జదరంగ రంగమునంగూర్చుండి దాయము, దుగ, తిగ, దచి, బారా, చౌనంచ, తీసంచ, యని యఱుచుచు రెండాట లాడినాడు కాని, పందెమును గెల్చుటయందు గెలుపుమాత్రము తన మిత్రునకేవదలి  తనకుగల