పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/34

ఈ పుట అచ్చుదిద్దబడ్డది
జడ్జి: నీవు వారిపై ఇటికఱాతిని విసరినట్లు సాక్ష్యము రుజువు చేయుచున్నది.

ప్రతివాది: అంతేకాదు దేవరా, ఆఱాయి వానికి తగిలినట్లుకూడ రుజువుచేయుచున్నది.

  • * * * * * * *
  పట్టణమున క్రొత్తగా అంగడిపెట్టిన సెట్టిగారికి మునిసిపల్ ఆఫీసు నుండి ఒక ఫారము పూర్తిచేసి పంపవలెనని వచ్చినది.  చాల యోచనచేసి దానిని పూర్తిచేసినాడు.

పేరు: సుబ్బిసెట్టి.
పుట్టుక: బ్రదికియే.
వ్యాపారము: ఏమిబాగా జరుగుటలేదు

  • * * * * *

"నాయనా, నేను పెండ్లిచేసికోవలెను"
"ఐదేండ్లకే పెండ్లా? ఎవరిని నాయనా?"
"అవ్వను"
"వెధవా, మాఅమ్మనారా పెండ్లాడుతావు?
"నీవుమాత్రము మాఅమ్మను పెండ్లిచేసికోలేదా?

  • * * * * *

ఉపాధ్యాయుడు: నీవు చాల మేధావంతుడైతే ఏయంత్రమును కనిపట్టవచ్చును?