పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/33

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోరుచుండును. సాధుపుంగవుడు అంతర్ముఖుడు. ఆసాధుమానవుడు బహిర్మఖుడు." "లోకవ్యవహారములయం దంతదృష్టి మిక్కుటమైన కొలదిని యాత డున్నతిని బొందుచుందును. మనవులకు శ్రేష్ఠతమకర్తవ్యము మైత్రి."

"ప్రేమన్యతీతముగ జ్ఞాన మసంభవము. వ్యర్ధముగ దినములకొలది యుపవసింపుచు, రాత్రులకొలది మేల్కొని ధ్యానమునందు కాలమును గడుపుచుండుటకంటెను శాస్త్రపాఠము, సాధుసంగమ మత్యుత్తమము. అంతకంటె ప్రేమయే సర్వోత్తమమము, సత్ స్నేహితులసంఘము సాధుపుంగవుల ప్రశంస సంగీతశ్రవణము అను మూడింటివలన నేను మిక్కిలి శాంతమును బొందుచు న్నాను. యౌవనమందు కామము కైశోరమందు ద్వంద్వము వృద్ధవయసున లోభమును అణచి పెట్టును."

"ఆజన్మజ్ఞాననులగువారే స్సర్వ శ్రేష్ఠులు." "నీరసత, నిర్జనతలకొఱకు నేను మిక్కుటముగ నన్వేషణం బొనర్చుచున్నాను."

"గంభీరనీరనతనయందే మనమున్నతి బొందును. జ్ఞానము లభ్యమగును."

"దు:ఖమే మానవుని ప్రకృతస్వరూప మని తెలుపుచున్నది".

అనుభూతి.

        నాగ నరసింహులు నాయనింవారు.

  పడతి పంపిన యానంది - వర్ధనంబు
  మ్లానమయిపోయె నెన్నడో - కాని, దాని
  నవ్యసురభిళ మార్ధవ -నైగనిగ్య
  ములు మదీయ హృదంతర -ముద్రితమగు
  నందివర్ధన కుసుమంబు - నందునిలిచి
  హృదయ పధముల సుధల వ -ర్షించుచుండు.