పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/30

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"నాకు, అవశ్యకము, ఉచితమనితొచినప్పుడు మాట్లాడుదును."

కన్ఫూషియాన్, ఒక దినమున నదీతీరమందు నిలుచుండి యిట్లనియె. "ఈనది నిరంతర మిటులనే ప్రవహించుచున్నది. మానవజీవన మెంత చంచలము! అయినను మానవుడు నిశ్చింతగా నుండును."

"అయ్యో? మానవుని బయట నెంతగా ప్రేమింపుచుందురో, వాని యంతర మును గూడ నంతగ ప్రేమింపగలుగుదునా"

"జీవితమం దెప్పుడును దృష్టిని సమ్ముఖమందు నిగిడింపుచుండుము. ఎప్పుడును వెనుతిరిగి చూడవలదు."

"సత్యము సాధుత్వ మనునవి నీకు ప్రభువులకు గాక. నీవు నీకే ప్రియ బంధువవు, స్వీయదోషములు పొడగట్టినప్పుడు వానిని విసర్జించుటకు సిగ్గుపడ కుము." "సైన్యమునకు సైన్యాధిపతి లోపించిన దానికంటెను, ధృఢసంకల్ప హీనులగు సైనికులవలన అపారనష్టం కలుగును."

"జ్ఞానమందు సందేహముండదు. ప్రేమయందు దుఖముండదు. సాహసికునకు భయముండదు."

స్వగ్రామవాసులు, బంధుబాంధవులయందు కన్ఫూషియాన అమాయకు నివలె బ్రవర్తిల్లుచుండెను. విస్తారముగ నెవ్వరితోడను మాటలాడ కుండెను. మందిరమునందు మిక్కిలి మితమగసంభాషించుచుడెను. మఱియు స్వల్పా హారము, ఉపవాసపరాయణుడై మెలంగ జొచ్చెను. ఆహారసమయమున గాని, శయనముమీద గూర్చుండికాని మాటలాడి యెఱుంగడు. ఆయన నిదురించు నప్పుడు శరీరమునుక్రతను జెందదు. అట్లన మృత శరీరతుల్యము కాదు. మిక్కిలి స్వల్పకాలముమాత్రమే నిదురింపుచుండెను. ఆయన ఇట్లు నుడివి యున్నాడు. 'మనము మృతవ్యక్తులయందు చూపు శ్రద్ధా భక్తులెక్కువగుటవలన జీవితవ్యక్తుల విషయమున మన కర్తవ్యములను మఱచుచుందుము."

"మృత్యువును తెలిసికొనగలిగినచో జీవితము అసత్యమని తెలియును."

"తన్నుదాను జయించుటనే ప్రేమయందురు. పరులను ఆత్మతుల్యముగ చూచుటను, స్నేహమందురు. మనము జీవితమందొక దినమైనను పరులను ఆత్మతుల్యముగ గాంచగలిగినచో, సంఘము ఉన్నతస్థితిని