పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/28

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

"సాధుత్వము, మానవప్రీతియే నా యుపదేశముల సారము"

"సత్యమును గాంచిన దానిని పొందుటకు ప్రయత్నింపుము. అసత్యము ను గాంచినప్పుడు అది నీహృదయమందు దాగియున్నదా యని పరిశీలించుకొని యున్నచో వెంటనే దానిని పరిత్యజించుము."

"సాధుజనములు విళంబముగ మాటలాడుదురు. ఆవిళంబమగ కార్యము లొనర్చుదురు."

"పురాతన పాపవిషయముల మఱచిపోయిన కొలది నీకు శత్రువులు స్వల్పమగు చుందురు."

"స్వీయదోషముల గాంచియు, వానిని తొలగించుకొనుటకు ప్రయ త్నించువానిని నే నింతవఱకు చూడలేదు. ఒక తప్పును జీవితమందు రెండు మార్లు చేయకుము. గాలి సేవనము కొరకు విహరించునప్పుడు, సరియగు మార్గమున నడువ వలదు. ఏలయన, ఏదయిన కార్యనిర్వహణకు బోవు బండ్లు ఆమార్గమున వచ్చును బోవుచుండును."

"సాధుజీవితమందు స్వభావము, శిల్పము, సమన్వయమును సృష్టించును. ఉభయులకు సామ్యముండని యెడల అహంకార ముండదు. కాని కృత్రి మత్వము ప్రకాశించుచుండును. ఉన్నత స్తరమందుండు మానవులతోడ నున్నత తత్వసంబంధమున బ్రసంగించుము. కాని యెప్పుడును నిమ్నస్తర మందుండు వ్యక్తులకడ నా విషయములను ప్రసంగించజనదు."

"సిద్ధిని బొందవలయునని వాంచించుట కంటెను, సాధనంగందుండ వలయునని తలంచుటనె ప్రేమయందురు. జ్ఞానము సముద్రతుల్యమగు గం భీరము. ప్రేమ మహాపర్వతమును బోలి శాంతము, జ్ఞానజీవితము నుప భోగించుము. ప్రేమవలన పూర్ణత, ప్రాచీనత, లభ్యమగును. సజ్జనుని దబా యించగలవు. కాని వానిని మూగవానిగ చేయజాలవు సుమా! ప్రేమ స్వీయ కళ్యాణముకంటె, పరుల కళ్యాణవిషయమును గూర్చి మిక్కుటముగ నన్వేషణం బొనర్చును."

"కడుపున కింత ముతకభోజనము, ధరించుట కొకింత వస్త్రము లభించి కొయ్యమీద చేతిలో తలబెట్టుకొని నిద్రించునప్పుడుండు శాంతి మఱి యేవిధమ ముగను లభ్యముకాదు. ఆసాధుభావమున లభింపుచుండు ధనము, సన్మానము మొదలగునవి మేఘములబోలి యస్థిరములు."