పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/19

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ములు 18-వ శతాబ్దము వాడగు కళువె వీరరాజు కృతమగు వచనభారతము, సముఖము వెంకట కృష్ణప్పనాయకుని వచనజైమిని భారతము మొదలగునవి. ఆధునిక వచనము 19-వ శతాభ్దముకడపటను 20 వ శతాంబ్దారంభముననుండిన చిన్నయసూరి నీతి చంద్రిక, చెదలువాడ సీతారామశాస్త్రి విసంధి సంఘటిత సంకృత నాటకకధలు, దక్కను పూర్వకధలు, బ్రౌను దొరగారి తాతాచార్యుల కధలతో ప్రారంభమై ఇక్కాలమున కుప్పలు కుప్పలుగా ఆంధ్ర వాజ్మయమును నింపుచున్నవి.

ప్రాచీనకాలమునుండి గొప్ప గొప్ప ప్రబంధములతోను ప్రౌఢకావ్యములతోను దులదూగు మన ఆంధ్రమున నాటక రచన లేకపోవుట కొంత హాస్యాస్పదముగా నున్నది. మాతృభాష (సంసృతము) నుండి పురాణములను ఇతిహాసములను ఆంధ్రీకరించిన మన ప్రాచీనకవులకు క్రీస్తుపూర్వము 5,6-వ శరాబ్ద ప్రాంతమున నున్న విశ్వవినుత కీర్తియగు కాళిదాసుని శాకుంతలమునుగాని, తరువాతి హర్ష కృతులగు తర్నావళి, మున్నగు నాటకరాజములు కంటబడలేదా! లేక "కావ్యేషు నాటకంరమ్యం" అనువాక్యమును వినియుండలేదా! ఆధినిక నాటకరచనకు పునాదివేసిన వారు ధర్మవరపు కృష్ణమాచార్యులు. ఇక్కాలమున ననేక నాటకకర్త లున్నను చిత్రనళీయకర్తలును, ఆంధ్రనాటక పితామహులునగు ధర్మవరపు కృష్ణ మాచార్యులును, ప్రతాపరుద్రీయది బహునాటకకర్తలగు కళాప్రపూర్ణ వేదము వెంకటరాయశాస్త్రులును గయోపాఖ్యానాది నాటక కర్తలగు లక్ష్మీనరసింహము గారును ముఖ్యముగా గణనీయులు, ప్రస్తుత కవులు ఆంగ్లేయులను బెంగాలీలను అనుసరించి నవలారచనకు పూనుకొనినారు. కాని తెనుగున నవలారచనకు మార్గదర్శకులు కందుకూరి వీరేశలింగం పంతులుగారు వారిననుసరించి అనేకు లిప్పుడు పూర్వకవులవలె "గొఱ్ఱెదాటు" పద్దతి ననుసరింపక పౌరాణిక, సాంఘిక చారిత్రకనవలలను, పూర్ణస్వాతంత్ర్యముతో వ్రాయుచున్నారు. ఇతర వాజ్మయము లలోని మార్పులను బట్టి ఆంధ్రవాజ్మయమునందును మార్పులను గల్గింప నుద్దే శించుచున్నారు. ఇదంతయు భావిభాషాభివృద్దికి మూలకందము కదా!