పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/17

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంగ్రహ ఆంధ్ర వాజ్మయ చరిత్రము.

మో. చలపతిరావుగారు.

మనము ఆంధ్రులము; మనభాష ఆంధ్రభాష, మనదేశము ఆంధ్రదేశము, జాతి భాష దేశములకు నొకే పేరుండుటచే వీనిలో నొకదానికొకదానికి సంబంధముండియేతీరును. జాతినిర్మాణమునకు భాషగాని దేశముగాని ప్రధానములు కావు. తల్లిదండ్రుల రక్తమే ప్రధానము; ఏలన నొక ఆంధ్రుడు ఇంగ్లాండు దేశమునకు వెళ్లి యొక ఆంగ్లేయయువతిని పెండ్లాడి కన్నబిడ్డ డాంధ్రుడగునా? ఆంధ్ర దంపతులు పరదేశములలో నివసించుచున్నను వారికి గలిగిన పుత్రులు ముమ్మాటికి ఆంధ్రులే. ఆంధ్రులలో చతుర్వర్ణముల వారున్నారు. కావున మనభాషకు గాని దేశమునకుగాని జాతినిబట్టి పేరు రాలేదని తెలియుచున్నది. కావున మొట్టమొదట దేశమును బట్టి భాషకు, భాషనుబట్టి జాతికి పేరు వచ్చియుండును. దేశమున కీపేరు ఎట్లు వచ్చినది? ఈవిషయమున పలువురు పలువిధముల అభిప్రాయపడుచున్నారు. భాగవత నవమస్కంధమునందు ఆంఢ్రుడను రాజొక్కడుండెను. ఆతఁడు పాలించినదేశము ఆంధ్రదేశమని పిలువబడినట్లున్నది. కావున ఆదేశమున మాట్లాడు భాషకాంద్ర భాషయనియు ఆభాష మాట్లాడువారు ఆంధ్రులనియు కొందఱి భ్రమ. రామానుజులవారు ఆంధ్రదేశమునకు నిర్దేశించిన ప్రదేశమని యర్ధము కావున దండకారణ్య సమన్విత ప్రదేశము ఆంధ్రదేశమనియు అందు నివసించువారు ఆంధ్రులనియు వారి భాష ఆంధ్రమనియు నభిప్రాయ పడుచున్నారు.

ఆంధ్ర రాజ్యము క్రీ.పూ 300 సంవత్సరముల ప్రాంతమునుండి నత్యున్నతదశ యందున్నట్లు మెగాస్తనీసు రచనల వలన తెలియుచున్నది. కాని మనకు క్రీ.వె. 11-వ శతాబ్ధము వాడగు నన్నయకు పూర్వపుకవిత్వము లభింపమిచే అతని పూర్వ మాంధ్రలిపి యుండియుండునా? లిపియేలేకున్న నన్నయ్యకునన్ని కట్టుదిట్టములతో నంత నిర్ధుష్టముగా నూతనముగా గ్రంధరచన సాధ్యపడియుండదు. కావున నన్నయ పూర్వము ఆంధ్రభాషలో ననేకగ్రంధము లుండియే తీరును. హిందూదేశమున నతి ప్రాచీనములగు అశోకుని శాసనములందలి లిపికిని తెలుగు లిపికిని సంబంధ

287