పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/16

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వంచిచూసి సరిపఱచుకొనవలయును. తర్వాత నిలుచున్న భాగమును కొలిచి చూచుకొనవలయును. ఎన్ని అంగుళములో అన్ని గడియలనితెలియును. అంగుళములోనివి భాగమొక్కొక్కటియు రెండునిమిషములని తెలియనగును. కావున సులభముగా గంటలు చెప్పవచ్చును. ఉదాహరణము 6 అంగుళములు నేలపై నున్నయెడల 10 అంగుళములు నిలబడియుండునుగదా! అప్పుడు 10 గడియల ప్రొద్దెక్కినదని తెలియనగును. 10 గడియలను గంటలుగా మూర్చుకొనినచో 4 గంటలు అనగా 6 + 4 = 10 కాబట్టి 10 గంటలని తెలిసికొనవచ్చును. పగలు 12 గంటలకు బిదప (అపరాహ్ణమున) నైనచో 10 గడియలు ప్రొద్దున్నదని తెలియుటచే 6 - 4 = 2 గంటలయినవని గ్రహించవలయును.

మఱియొక యుదాహరణము:- నిలబడినపుల్ల కొలత 8 అంగుళములు 7 విభాగములున్నవను కొందము. 8 గడియలకుపైన 14 నిమిషములుగదా! 8 గడియలును 192 నిమిషములు కావున 192 + 14 = 206 నిమిషములు అయినవి. అనగా 3 గంటలు 26 నిమిషములు సూర్యోదయకాలము 6 గంటలను చేర్చగా 9 గంటలు 26 నిమిషములయినవని యేర్పడుచున్నది. సాయంకాలమున నిట్టికొలత యేర్పడినయెడల 6 గంటలలో 3-36 పోగా 2 గంటలు 34 నిమిషములయినవని తెలియనగును. ఈ పద్దతి యెండకాయుచున్నప్పుడే యుపయోగపడునని ప్రాజ్ఞులు గ్రహింతురుగాక. గడియరములేని ప్రదేశముల యం దీపద్దతి మిక్కిలి సహకారియైయుండగలదు. సొంతగడియారము నిలిచిపోయినప్పుడు పై విధమునగంతలను తెలిసికొని గడియారమును సరిచేసికొనుటకును పనికివచ్చును.