పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/15

ఈ పుట ఆమోదించబడ్డది

గంటలు నిర్ణయించు పద్ధతి.

విద్వాన్ -మునిరత్నపిళ్ళగారు.

   "కాష్టమును పదునాఱు భా - గములుచేసి
    యెండలోఁ బెట్టి సమకోణ - ముండునటుల
    పుల్లనీడ పరుండిన - పుల్లకొనకుఁ
    దగులునట్టుగ సరిచేయఁ - దథ్యముగను
    నిలుచు పుల్లభాగంబు తా - నిజఘటికలు"

భూమి తన్నుదాను ఒకసారి చుట్టుకొనుటకు 24 గంటలగుచున్నట్లంద ఱెఱుఁగుదురు గదా! దీనినే పూర్వులు సూర్యుడు 24 గంటలలో(60 గడియలలో) 360 డిగ్రీలుగల భూమిని ఒకసారి ప్రయాణము చేయుచున్నట్లుచెప్పిరి. కావున 90 డిగ్రీల ప్రయాణమునకు 6 గంటల కాలమగుచున్నది.

దీనినిబట్టి పూర్వులు పై నుదహరించిన విధమున గడియలు తెలిసికొనుచుండిరి.

ఎట్లన? 16 అంగుళముల నిడివిగల యొకపుల్లను గైకొనవలయును. ఒక్కొక్క అంగుళము 12 భాగములుగా జేసికొన్నచో మిగులమంచిది. పగలు 12 గంటలు కాకమునుపు అనఁగాఁ బూర్వాహ్ణమున నెన్ని గంటలయినవో తెలిసి కొనవలయునన్న పైఁ గనిన పుల్లను ఎండకాయుచున్న సమప్రదేశమున బెట్టి వంచవలయును. అప్పుడు 16 అంగుళముల పుల్లలో కొంతభాగము నిలిచియుండును. కొంతభాగము నేలపైఁ బరుండియుండును. పరుండియున్న భాగముయొక్క కొనకు నిలుచున్న భాగముయొక్క నీడ సమముగానుండునట్లును 90 డిగ్రీల కోణమేర్పడునట్లును కొంత ముందు వెనుకలుగా