పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/10

ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సుఖించుచుండునా? ఉండినచో నామె పతివ్రతలలొ మేలుబంతి యనిపించు కొనునా? ఇంద్రునివెంట నడవులలో సంచరించుచున్న శచిని నహుషుడు గోరుట యసంభవము. ఇంద్రపదము నధిష్టించినవాని మనస్సంత నీచకృత్యము నకు జొచ్చునా? లేక ఆపదవి నందిన వారికెల్ల నట్టిబుద్ధియే కలుగునా?

   మునులచే పల్లకి మోయించెనని యొకచోటను అగస్త్యుని గాంచి పరిహాసము కై త్రాటిని జూపి పామని బెదరించెనని యొకచోటను గలదు.  విచారింప నీరెంట నెదియు నిజముకాదు. నూఱు యాగలు చేసి ఋషులకు సర్వస్వముదానము చేసి వారినిసంపూర్ణసంతుష్టులగావించిన నహుషుడు, ఇంద్రపదవిని వచ్చినంత నే మఱునాడే కన్నుగానక ముందువెనుకలు మఱచి తలకు చెప్పులడిగెడు అల్పుని చందమున మునులచే పల్లకి మోయింప గోరునా? మతియున్న మానఫునకిది విశ్వాసార్హమగునా?
 అగస్త్యుడు మహామహీమా సంఫన్నుడని యెఱుగకుండునంత బాలకుడా నహషుడు? ఋషులే దేవతలకుసైత మధికారలని నమ్మి వారిమూలముననే క్రతుశతము కావించిన ప్రభువు మునుల మహిమల నెఱుగనివాడనుటకంటె ప్రపంచ విరుద్దము వేఱొండునుండునా? అందును లోకవిఖ్యాత మహైమా సంపన్నుడు అగస్త్యునే గేలిచేసెననుట యని చారమూలకముకాదా? తాము గీచినగీతయే వేదము. తమ వాక్యములను కాదనువాడే పతితుడు, పాపి, పాషండుడు అనిశాపించిన దురహంకరబూయిష్ఠులగువారి వాక్యము లిట్లుగాక మఱెట్లుందును? తప్పొప్పుల విమర్శించుట కెవ్ఫరికి నధికారములేదని చండ శాసనము కావించియున్నప్పుడు వారేది యెట్లు వ్ర్రాసికొన్ననేమి? నాడుకాకున్న నాలుగుతరమ్లు దాటినపిమ్మటనైన వెఱ్ఱిలోకము నమ్మకుండునా?
   నహుషుడు తను కనుకూలుడై యుండని కతమున లోకుల కనులు గప్ప గొన్ని యపనిందలు కల్పించి పామదై పడియుండుమనిశపించి నిరురించు నపుడు పామును గొట్టినట్లేకొట్టి చంపివైచిరి.  వాడేట్టివాడైనను ఇంద్రునివంటి కీలుంబొమ్మ మఱియుకడు దొరకడని యతినినే యధాస్థానమున నిల్పిరి.