పుట:Telugu Right to Information Act.pdf/20

ఈ పుట ఆమోదించబడ్డది

అధికార యంత్రాగాన్ని అదేశించడం, ఆ చర్యలలో ఈకిందివి కూడా భాగాలు :

(i) ఎవరైనా కోరిన పక్షంలో ఒక ప్రత్యేకమైన రూపంలో సమాచారం అందుబాటులో ఉంచడం
(ii) కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిని నియమించడం
(iii)) నిర్దిష్టమైన సమాచారాన్ని లేక కొన్ని విభాగాల సమాచారాన్ని ప్రచురించడం
(iv) రికార్డుల నిర్వహణ, మేనేజ్ మెంట్, విధ్వంసానికి సంబంధించి అనుసరిస్తున్న పద్ధతులలో కొన్ని అవసరమైన మార్పులుచేయడం.
(v) అధికార యంత్రాంగంలోని అధికారులకు సమాచార హక్కుపై శిక్షణ ఇచ్చే సదుపాయాలను హెచ్చించడం.
(vi) సెక్షన్ 4 లోని సబ్ సెక్షన్ ‘(1) క్లాజు (బి) అమలుపై వార్షక నివేదిక రూపొందించడం.
(బి) ఫిర్యాదులను కలిగిన నష్టాన్ని కానీ ఇతర కష్టాన్ని కానీ పరిహారం ద్వారా పూడ్చాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం.
(సి) ఈ చట్టంలో నిర్దేశించిన విధంగా జరిమానాలు విధించడం
(డి) దరఖాస్తును తిరస్కరించడం
(9) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ తన నిర్ణయాన్ని, అప్పీలు అవకాశం ఉంటే ఆ వివరాలతో సహాఫిర్యాదుదారుకూ, అధికార యంత్రాంగానికి నోటీసు ద్వారా తెలియపరచాలి.
(10) కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ అప్పీలు విచారణను నిర్ణీత పద్ధతిలో జరపవచ్చు


20. (1) ఫిర్యాదుపై లేక అప్పీలుపై కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట్ర సమాచార కమిషన్ నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్రపౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైన కారణం లేకుండా దరఖాస్తును స్వీకరించలేదని భావించినా, తగినకారణం లేకుండా సెక్షన్ 7లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపు సమాచారం అందించలేదని భావించినా,సమాచారం కోసం అభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసి కూడా తప్పుడు, అసంపూర్తి తప్పుదోవబట్టించేసమాచారం అందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే విధంగానయినాసమాచారం అందకుండా అడ్డుపడ్డారని భావించినా దరఖాస్తును స్వీకరించేంతవరకు లేక సమాచారం అందించేంతవరకు రోజుకు 250రూపాయలు చొప్పున జరిమానా విధించే ముందు కేంద్ర పౌర సమాచార అధికారికి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారిపైనే ఉంటుంది.

(2) ఫిర్యాదుపై లేక అప్పీలుపై నిర్ణయం తీసుకునే సమయంలో, కేంద్ర పౌర సమాచార అధికారి లేక రాష్ట్ర పౌర సమాచార అధికారి సరైనకారణం లేకుండా పదే పదే దరఖాస్తును స్వీకరించలేదని, లేక సెక్షన్ 7 లోని సబ్ సెక్షన్ (1) కింద నిర్దేశించిన కాలపరిమితిలోపుసమాచారాన్ని అందించలేదని కేంద్ర సమాచార కమిషన్ లేక రాష్ట సమాచార కమిషన్ భావించిన పక్షంలో, లేక సమాచారం కోసంఅభ్యర్ధనను దురుద్దేశంతో తిరస్కరించారని భావించినా, లేక తెలిసికూడా తప్పుడు, అసంపూర్తి , తప్పుదోవ పట్టించే సమాచారంఅందించారని భావించినా, అభ్యర్ధనలో కోరిన సమాచారాన్ని ధ్వంసం చేశారని భావించినా, మరే