పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/90

ఈ పుట ఆమోదించబడ్డది

ర్నవమి రోజున తుంగభద్రా తీరంలో జరిగేవి. ఆ వుత్సవాలలో ఆయన ఒక కోలాట నృత్యాన్ని చూశాడట. అది విజయనగరం రాజవీధిలో వూరేగింపులో అది మేళాల కోలాహలంతో నిండివుందట. జనసమ్మర్థంతో వీథి అంతటా త్రొక్కిసలాటగా వుందట. ఊరేగింపు సాగిపోతూ వుండగా, ఒక వినోద కార్యక్రమం తరువాత మరో వినోదానికి సంబందించిన సమూహాలు వస్తూండేవట. ఇంతలో ఒక కోలాట బృందం వచ్చేదట. అందరి చేతుల్లోనూ వివిధ రంగులతో చిత్రించబడిన కోలాట కఱ్ఱలున్నాయట. తలగుడ్డలతో సకల వర్ణశోభితంగా రంగుల రంగుల ఈకెలు ధరించి వారు చూడ సొంపుగా వున్నారట. బృందానికి హంగుగా జంత్ర వాద్యాలు మ్రోగుతూ వుండగా లయప్రకారం బృందమంతా పాట పాడుతూ, మధ్య మధ్య 'కోలే. కోలే' అనే కేకలతో అడుగు వేశారట. కోలె కోలే అంటే ఆయనకు ఏమీ అర్థం కాలేదట. కాని అది ఒక అందమైన మాటై వుండవచ్చని సూచించాడు.

అబ్దుల్ రజాక్ చెప్పిన అద్భుత విషయాలు:

ఇమ్మడి ప్రౌఢ దేవరాయలు క్రీ.శ. 1423, క్రీ.శ. 1446 వరకూ రాజ్య పరిపాలన చేశాడు. విజయనగరాన్ని పరిపాలించిన సంగమ వంశరాజులలో ప్రౌఢ దేవరాయలు అగ్రగణ్యుడు. ఈయన కాలంలోనే విజయనాగర రాజ్యం మహోన్నత స్థితికి వచ్చింది. ఈయన ఆస్థానం లోనే శ్రీనాథ మహాకవికి కనకాభిషేకం జరిగింది. ఈయన కాలంలో 1443 లో అబ్దుల్ రజాక్ విజయనగరాన్ని చూడ వచ్చి ఆ పట్టణ వైభవాన్ని, ప్రౌడదేవరాయల మహోన్నత స్థితిని వర్ణించాడు. ఆయన పారసీక దేశంనుండి వచ్చాడు.

విజయనగర రాజభవనంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ వర్ణించాడు. అంతేగాక ఆ మహోత్సవ సమయంలో అద్భుత నాట్య ప్రదర్శనాలు జరిగినట్లు పేర్కొన్నాడు. ఆ మహోత్సవాలు జరిగే స్థలానికి, మంటపాలకు నడుమ చక్కగా తీర్చిన ఖాళీస్థలం కలదట. అందు గాయకులు గానంచేశారు. కథకులు కథలు చెప్పారట. గాయకురాండ్రలో చాలమంది యవ్వనంలో వున్న కన్యకలేనట. వారి బుగ్గలు చంద్రుని వలె వుండి, వారి ముఖార