పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/83

ఈ పుట ఆమోదించబడ్డది

సువర్ణాక్షరాలతో లిఖించి వుంచిన కోన వెంకటరాయశర్మగారు 'భారతీ' పత్రికలో వుదాహరించారు. అంతేగాక శాలివాహన శకం 1300 నాటి వానపల్లి శాసనంలో కూడ ఆయన సంస్థానంలో నిరంతరం జరిగే కార్యక్రమ ప్రణాళికలన్నీ లిఖింపబడి వున్నాయి.

ఈ విధంగా ఆయన కొండవీటి రాజ్యాన్ని బహుపరాక్రమంతోను, సకల కళావిశిష్టతలతోను పరిపాలించాడు. ఆయన అనంతరం ప్రోలయ దేవుని తమ్ముని కొడుకు పెదకోమటి వేమారెడ్డి రాజ్యానికి వచ్చాడు. ఈయన విద్యత్తుకు మెచ్చి ఈయనకు సర్వజ్ఞ చక్రవర్తి అనే బిరుదు కూడ ప్రసాదించబడింది.

వేమారెడ్డి రచనలు ఎన్నేన్నో;

ఈయన శృంగార దీపిక, అమరుశతక వ్యాఖ్య వ్రాసి దక్షిణ హిందూదేశ మంతటా ప్రఖ్యాతి పొందాడు. కుమారస్వామి, సాహిత్య చింతామణి అనే అలంకార శాస్త్రాన్ని రచించి ప్రఖ్యాతి వహించాడు. అంతేగాక 'సంగీత చింతామణి', 'వీర నారాయణ చరిత్ర', 'శృంగార భూషణం', 'రఘునాథాభ్యదయం', 'వేమాభూపాల చరిత్ర', 'శత్దరత్నాకరం', మొదలైన అనేక గ్రంథాలను కూడ రచించారు.

ఈ విధంగా కోమటి వేమన క్రీ.శ. 1420 వరకూ పరిపాలించాడు. రాజ్యంలో శాంతి భద్రతల్ని నెలకొల్పిన కాటయవేముని బావమరిది అయిన కుమారిగిరిరెడ్డి పరిపాలనా భాద్యతల్నీ కాటయవేమనకు నప్పచెప్పి తాను మాత్రం వసంతోత్సవాలతోను, కవులతోనూ, కళాకారులతోను, నిత్య కళ్యాణంగా పచ్చ తోరణంగా కొండవీటి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. కుమారగిరి రత్న సింహాసనాధ్యక్ష,, జగద గోపాలరాయ, వేశ్యాభుజంగ, పల్లవాదిత్య, త్రిలింగాధీశ్వర, జంభూద్వీపేశ్వర బిరుదాంకుడు. ఈయన బాపట్ల భావనారాయణస్వామి దేవదాసియైన వల్లెమకు బుట్టిన లకుమాదేవి ప్రియడు. ఆయనవద్ద సేనానిగా వున్న దొరవరెడ్డి లకుమాదేవిని కుమారగిరికి కానుకగా అర్పించాడు.

ఆపరనాట్య సరస్వతి లకుమాదేవి:

లకుమాదేవి కుమారగిరి ప్రేయసి, అందాలరాణి, చక్కదనాల చుక్క, అపర నాట్య సరస్వతి, కుమారగిరి ఆస్థానంలో కవి, గాయక, శిల్పి, సామంతాది