"బత్రా" నృత్యమూ, పంట కోతల ముగిసిన తరువాత చేసే "బౌలు" నృత్యమూ చూడ ముచ్చటగా వుంటాయంటారు సంపత్ కుమార్ గారు.
పంజాబు
పంజాబు జానపద కళారూపాలలో పేరెన్నిక గన్నదీ, ప్రజల నెక్కువగా ఆకర్షించేది భాంగ్రా నృత్యం. గోధుమ విత్తనాలను చల్లే సమయంలో ఎంతో ఆనందంగా సామూహికంగా ఈ భాంగ్రా నృత్యాన్ని దేస్తారు. ఈ నృత్యాన్ని భారతదేశంలో అన్ని ప్రాంతాల వారు మెచ్చుకోవటమే కాక విదేశీయుల మన్ననలను కూడ అందుకుంది. అలాగే "కులూ లోయ"లో చేసే "ఖడ్గ నృత్యం" కూడా చెప్పుకో తగిందే. పంజాబులో ప్రత్యేకంగా చేసే "గిడ్డ" నృత్యమూ, పురుషులు చేసే మరో నృత్యం "ఝమర్" నృత్యమూ చెప్పుకోతగివవి. అలాగే "జామీర్" , "ధృన్" , "సమ్మి లోధి" , "దమల్" అన్న నృత్యాలు కూడ చెప్పుకోతగినవి.
బీహారు
బీహారులో "హో" అనే తెగవారు దేవ పూజ సమయాల్లో చేసే "మాఘే" నృత్యమూ అలాగే వేటలోనూ, యుద్ధ సమయాల్లోనూ చేసే "బౌ" నృత్యమూ, వ్వవసాయ తరుణంలో చేశే "గోంనామా" మొదలైన నృత్యాలు చెప్పుకోతగినవి.
అలాగే ఛోటా నాగ పూర్ ప్రాంతంలో ఒరియన్ జాతి వారు "జదుర్" నృత్యాన్ని, రాంచీ ప్రాంతపు గిరిజనులు "ఖరియాలా" నృత్యాన్నీ, "జిటియా" నృత్యాన్ని చేస్తారు.
ఉత్తర ప్రదేశ్
ఉత్తర ప్రదేశ్ లో ఎక్కువ ప్రచారంలోని వచ్చిన "జరాదినటి" నృత్యం ముఖ్యమైంది. ఈ నృత్యంలో బాలబాలికలు పళ్లెములను అత్యంత చమత్కారంగ సుందరంగా వ్రేళ్ళ మీద త్రిప్పుతూ వయ్యారంగా నృత్యాలు చేస్తారు. అలాగే అల్లోరా కొండల్లో, "భోటియా" గిరిజనులు చేసే "రంగ్ భంగ్" నృత్యమూ టెహ్రీగార్వాల్ గిరిజనులు చేసే "ఛౌఫలకేదార" నృత్యమూ శౌర్య ప్రతాపాలను ప్రదర్శించే పాండవ నృత్యమూ బహుజనాదరణ పొందినవంటారు సంపత్ కుమార్ గారు.