పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/814

ఈ పుట ఆమోదించబడ్డది

మణిపురి

భారతీయ శాస్త్రీయ నృత్యాలలో మణిపురి లాలిత్య నృత్యం ఎంతో ప్రఖ్యాతి వహించిన నృత్యం. అలాగే భక్తి సంబంధమైన "రాస నృత్యం", లాయ్ హెరోబ, ఈబల్ చోంన్ భీ - ఖంబడోయంబి (శివ పార్వతుల నృత్యం) "పుంగ్ చోలం నృత్యం" హోలీ పండుగలో చేసే ధాబల్ చోబీ నృత్యం, గిరిజనుల నృత్యమైన హెలోయ్ నృత్యం , "ముఖోరిళా" నృత్యం, కబయ్ నాగ జాతి వారు చేసే "ఫైచర్" పోన్ సాలం, "టెండన్ ఫెయ్ బోక్" మొదలైన జానపద నృత్యాలు ఎంతగానో ప్రాముఖ్యం వహించాయి.

అలాగే బర్మా సరిహద్దు కొండలలో అడవులలో వున్న "సంగ్ తం" నాగజాతివారు ఒకరికి గౌరవార్థం చేసే విందులో "నెరిచుంగ్టి" నృత్యమూ, వేటకు బయలు దేరే సమయంలో చేసే "సంగ్ ఫా నృత్యం" గ్రామాలను దాడి చేసే ముందు "బయక్ సుట్ సుక్" నృత్యాలను చేస్తారు.

భూటాన్ ప్రాంతంలో బౌద్ధ మత సాంప్రదాయా నృత్యాలు చేస్తారు. ఇవే "లేపాచ్", "షాప్ ధో" నృత్యాలుగా ప్రసిద్ధి పొందాయి.

మధ్య ప్రదేశ్

మధ్య ప్రదేశ్ లో గోడులు చేసే "కర్మా నృత్యం" భిల్లులు చేసే "జబురియా నృత్యం" , "లడా లడీ" నృత్యాలూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తాయి.

"కట్ పుత్లీ" అనే బొమ్మల నృత్య ప్రదర్శనం, మధ్యప్రదేశ్ కు చెందిన జానపద కళారూపాలలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. భారత రామాయణగాథల్ని బొమ్మల చేత అభినయం చేయిస్తూ నృత్యం చేయిస్తూ ప్రదర్శిస్తూ వుంటారు.

బస్తరు జిల్లాలో గిరిజనులు పౌర్ణమి నాటి రాత్రి "నవరాణి" నృత్యాన్ని, మాఘ మాసంలో "దేవరీ" నృత్యాన్ని, చైత్ర మాసంలో "చైత్ర దండ" నృత్యాన్ని శ్రావణ మాసంలో "ఘోంగా" నృత్యాన్నీ చేస్తారు.

బెంగాల్

బెంగాల్‌లో ఆదిమ వాసులు చేసే "సంతాల్" నృత్యమూ, వివాహ సమయాలలో చేసే "గులేరియా" నృత్యమూ, దసరా సందర్భంలో దుర్గాపూజలనాడు చేసే