పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/781

ఈ పుట ఆమోదించబడ్డది

బోధన్ కు దగ్గరలో నున్న రుద్రూరు, జహదిమలపూర్ లో, భజన పార్తీలు భాగవత సమాజాలూ పనిచేస్తూ వున్నాయి. ఈ సంస్థల్లో కాశీనాద్, వెంకటేశ్వర్లు, జైపాల్, కోటయ్య, వీరేశం, శ్రిమతి వీరేశ్వరం మొదలైన నటీమనటులు పనిచేశారు.

అదిలాబాదు జిల్లా

అదిలాబాద్ జిల్లాలో యప్పలగూడ, బాందా, కప్పరాళ్ళ మొదలైన ప్రదేశాల్లో యక్షగానాలను ప్రదర్శించే సమాజాలు పని చేశాయి. అదిలాబాద్ తాలూకా పంకిడి గ్రామంలో ఒక డప్పుల నృత్య బృందముంది.

మధోల్ చుట్టు పట్ల గ్రామాలైన భాయనాపి, కొత్త గని, మీర్జాపూరు, తిమ్మాపూర్, దిగమ, సుంకలి, మహాజం, చుండి, కోమరి మంజరి, బాసార్ మొదలైన గ్రామాలలో యక్షగాన బృందాలు పనిచేశాయి.

ఘనపురం తాలూకా కన్నపూర్, దస్తురాబాద్, కాలీ మడుగు, ఇందనపల్లి, రామోజీ పేట మొదలైన ప్రాంతాల్లో యక్షగాన దళాలు పని చేశాయి. వడ్ల నరసింహులు, నరసింహయ్య, గోవింద రావు, వెంకటరెడ్డి మొదలైన కళాకారులు ఈ దళాల్లో పనిచేశారు.

లక్సెట్టి పేట తాలూకా మున్నూరు, పొట్టాయి పల్లె, రాయం పేట, దౌడ పల్లె మొదలైన చోట్ల వీథి నాటక సమాజాలు పనిచేశాయి. రాయం పేటలో ఒక బుర్రకథ దళం కూడ వుండేది.

బన్నూర్ ప్రాంతంలో కొత్త పల్లె, నీలవాయి గ్రామాలలో వీధి భాగవత దళాలూ, వేమన పల్లె, నీనాల్, భీమవరం, మిట్ట పల్లె, అదిల్ పేట, సిర్వా అమద్ మొదలైన గ్రామాలలో యక్షగాన దళాలు పనిచేశాయి.

ఈ దళాలలో చిక్కిపల్లి కృష్ణయ్య, సాంబయ్య, బన్ రెడ్డి మొదలైన వారు పనిచేశారు.

నిర్మల్ హస్త కళలకు ప్రసిద్ధి చెందిన గ్రామం. ఇక్కడ చిరుతల రామాయణం ప్రదర్శించే జానపద కోలాట సమాజం పనిచేసింది. ఇది తెలంగాణాలో ఒక ప్రత్యేకమైన కళా రూపం.