కొలది ఉన్నట్లు స్థానిక ప్రతాపరుద్ర చరిత్ర వల్ల తెలుస్తూంది. ఓరుగల్లు మైలారదేవుని వుత్సవంనాడు వీరభటులు చేసే సాహస వీరకృత్యాలు ఆతి భయంకరంగ వుండేవి. వీరశైవమతోద్రేకులు మండుతూ వుండే నిప్పుగుండాలలో సాహసంగా దూకేవారు. నారసాలను గ్రుచ్చుకునేవారు. భైరవుని గుడి, చమడేశ్వరి, మహాశక్తి నగరు, వీరభద్రేశ్వరాగారం, బుద్ధదేవుని విహార భూమి, ముసానమ్మ గుడి,కొమరుసామయ్య నగరు మొదలైన ప్రదేశాలు కాకతీయ ప్రతాప రుద్రుని కాలంలో గొప్ప మహత్తు కలిగిన ప్రదేశాలని ప్రసిద్ధి పొందాయి.
- దిసమెలదేవత ఏకవీరాదేవి:
ఏకవీరాదేవి శైవదేవత. ఏకవీర పరశురాముని తల్లియైన రేణుకాదేవి యని ప్రతీతి. ఈమెను మూహురం అనే గ్రామంలో వెలసి వుండడం వల్ల మూహురమ్మ అని పిలిచేవారు. ఈమె నగ్న దేవత. ఈమె ఆనాడు రాయలసీమ లోనూ, తెలంగాణా లోను ఎల్లమ్మ దేవత అని కూడ పిలుస్తూ వుండేవారు.
ఓరుగంటిలో ఓరుగంటి ఎల్లమ్మ అనే ప్రసిద్ధ దేవత వుండేది. ఈ ఎల్లమ్మనే రేణుక అనికూడ పిలిచేవారు. కాకతీయుల కాలంలో బవనీలు, మాదిగ స్త్రీలు ఎల్లమ్మ కథను వీరావేశంతో చెపుతూ వుండేవారనీ, వారు మోగించే జవనిక జుక జుంజుం జుక జుం జుమ్మంటు సాగేదనీ, క్రీడాభిరామంలో ఉదహరించబడింది.
వాద్యవైఖరి కడు వెరవాది యనగ ఏకవీరాదేవి యెదుట నిల్చి,
పరశు రాముని కథ లెల్ల ప్రౌఢిపాడె చారుతరకీర్తి బవనీల చక్రవర్తి.
- భక్తిపారవశ్యంలో, నగ్న నృత్యాలు:
రేణుకాదేవి జమదగ్ని మహాముని భార్య; పరశురాముని తల్లి. తండ్రి ఆజ్ఞ ననుసరించి పరశురాముడు తన తల్లి తలను ఖండించగా, ఆ తలకాయ మాదిగవాడలో పడిందట. శిరస్సు లేకుండా వున్న విగ్రహం ముందు నగ్ననృత్యంలో పూజిస్తూ