పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/744

ఈ పుట ఆమోదించబడ్డది

రెడి బోలిరీచక్ జనండేకరేచ
సావుకార్ హనుమంతరెడ్డిర్ చోర లూటోరేచ

అంటూ పాటలు పాడుతూ నృత్యం చేస్తారు. సుగాలీలు నివసించే ప్రాంతాన్ని తండా అంటారు. వీరిని లంబాడీలు అని పిలుస్తారు.


నామాల సింగని నృత్యం

రాయలసీమలో ఉగాది పండుగకూ, పీర్ల పండగకూ ఉరుసు సందర్బాలలోనూ, తిరుణాలలోనూ నామాల సింగని నృత్యం చేస్తూ వుంటారు.

ముఖానికి నల్లని బొట్లు పెట్టి ఎఱ్ఱటి రంగు మచ్చల్లాగా అలంకరణ చేసి నుదుట నామాలు పెడతారు. నాలుక మీద మరో పెద్ద నాలుకను పెంచి, తలమీద రుమాలు చుట్టి వేప మండల్ని దోపుతారు. రెండు చేతుల్ని పెనవేస్తూ గొలుసుతో కడతారు. రెండు చేతుల్లోనూ పిడి బాకులుంటాయి. నడుముకు చుట్టూ దట్టిగుడ్డ కడతారు. ఎఱ్ఱటి సల్లడం తొడుక్కుంటారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. ఇలాంటి అలంకరణ చేసిన తరువాత రెండు చేతులకూ, భుజాలకూ నూలు త్రాళ్ళతో రెండు ప్రక్కలా పట్టుకుంటారు. తరువాత తప్పెట దరువులకు అనుకూలంగా నామాల సింగడు అడుగులు వేస్తాడు. పగ్గాలు పట్టుకున్న వాళ్ళు అతనికి అనుగుణంగా అడుగులు వేస్తూ తిరుగుతూ వుంటారని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డి గారు జానపద నృత్యకళలో వివరించారు.

నామాల సింగడు ముఖ్యంగా రెండు చేతుల్ని పైకి ఎత్తుతూ కత్తుల్ని వేగంగా తిప్పుతూ ఒక్కొక్క కాలిని వెనక్కి ముందుకీ నేలపై తాటిస్తాడు. మీసాలను మెలివేస్తూ వుంటాడు. ఎర్ర్రని నాలుక వ్రేలాడుతూ వుండగా స్మారకం వచ్చి వెనక్కి చాపుతూ అడుగులు వేస్తాడు. అడుగులు బస్కీలు తీసినట్లుంటాయి. అడుగులకు తగినట్లు తప్పెట వాయిద్య గతులు ఇలా వుంటాయి.

మొదటి సారి__

జెగ్ నకన్
జెగ్ నకన్
జేగ్ నకన్