పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/743

ఈ పుట ఆమోదించబడ్డది

వీరి నృత్యంలో ముఖ్యంగా చేతులు చూపించటం, వలయా కారంగా తిరగటం చేస్తారు. ఈ నృత్యాన్ని స్త్రీ పురుషులిరువురు కలిసే చేస్తారు. ఒక పురుషుడు ప్రత్యేకంగా డప్పు కొడతాడు. డప్పు వరుసలకు అనుకూలంగా స్త్రీలు రకరకాల అడుగులు వేస్తూ గుండ్రంగా తిరుగుతారు.

వీరి నృత్య బృందంలో 10 మంది వరకూ పాల్గొంటారు. వారి సంప్రదాయ దుస్తుల్ని ధరిస్తారు. కాళ్ళకు గజ్జెలు కడతారు. చప్పట్లు చరుస్తూ వలయాకారంగా శబ్దానికి అనుగుణంగా నృత్యం చేస్తారు. లయ ప్రకారం చప్పట్లు చరుస్తూ వుంటే మిగతా వారు పాటను ఆలాపిస్తారు.

వీరి పాటలన్నీ వారి గురువైన 'సేవలాక్ ' మీదనే పాడతారు. ప్రధమంగా అందరూ నిలబడి ముందుకు వంగి చేతులతో చప్పట్లు కొడుతూ ఈ విధంగా పాడతారు.

కోయినారియే కోచళో సోసో
కోయినారియే కూణిన చోడో
కోయినారియే శంక్రనచోడో
కోయినారియే కాయ్ ఆంకుదీచ
కోయినారితే రవియ్యదీచ
సుమసోతితి జోప జానలిజో

అంటూ గిర్రున తిరిగి శరీరాన్ని క్రిందికి పైకి వంచుతూ లేస్తూ చేతుల్ని పైకెత్తి చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ అదే సమయంలో పాడే పాటను ఒకరు పాడుతుండగా, మిగిలిన వారంతా ఈ విధంగా వంత పాడతారు.

బాలే పెంచనే వెంటాపర్ రెడిబోలిరీచ
రెడి బోలరీచక్ జినందేకరేచ
సావుకార్ భీకియ్వార్ చోరలూటోరేచ
బాయే పెంచనే వెంటాపర్ రెడి బోలిరేచ