పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/728

ఈ పుట ఆమోదించబడ్డది

వుపయోగించుకున్నారు. దళాలకు సంబంధించిన క్యాంపులలో

వున్న వారందరూ వలయాకారంగా నిలబడి, ఒకరు పాటను ప్రారంభించి, ఆ పాటను సామూహికంగా అందరూ అందుకుని ఆ పాటకు తగిన అడుగులను అందరూ ఒకే రీతిగా క్రమశిక్షణతో లయబద్ధంగా ధులా పాటను పాడుకునే వారు. ధులా కళారూపంలో పాడుకునే పాటలు అనేకం వున్నా ఈ క్రింద వుదహరించిన పాట ఎంతో ప్రచారంలో వుంది.

లంబాడి గన్నె గాడు:

వాని పేరు గన్నె గాడు, లంబాడోడు గన్నెగాడు
వాడిపల్లె దోచినాడు, ఓడపైన ఎక్కినాడు
కొండపోల్లో కొని నాడు - కొండలాగ ఎదిగి నాడు
మీర్సాలం చూసినాడు - మీసామె దువ్వినాడు
గూడెంలో పేల్చినాడు - గుండేంతో చేసినాడు ॥వాని॥
రామ్మడు గూరేసినాడూ - రాళ్ళ గుట్ట కెక్కినాడు
పిట్టల్ గూడెం కొట్టినాడు - పిట్టల్లే ఎగిరినాడు
నల్లగొండ తిరిగినాడు - నలుగురితో మెలిగినాడు
పల్లెల్లో తిరిగి నాదు - ప్రజల బాధ తెలిసినోడు ॥వాని॥
బుగతాలా చూసినాడు బలుపంతా తీస్తాడాడు
దళాన్ని నడిపినాడు -దొరలనంతా దోస్తాడాడు ॥వాని॥
బందూకూ పట్టినాడూ - బరిగీసి నిల్చినాడు
పోకిళ్ళకు ఓర్చాడాడు - పోలీసోళ్ళ మింగుతాడు ॥వాని॥
రైతుల్లో రాజు వాడూ - రాజ్యమే తెస్తాడాడు
కమ్మినిస్టూ కత్తి వాడు - కలలన్ని పండిస్తాడు ॥వాని॥
మరుసటేడు వస్తాడాడు - మా యిండ్లకే వస్తాడాడు ॥వాని॥

ధులా కళారూపంలోని పాటలు ఈ విధంగా సాగుతాయి. ప్రజా పోరాటంలో ప్రజా కళాకారులు ఈ పాటలను ప్రజల్లో ప్రచారానికి బాగా ఉపయోగించారు.