పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/727

ఈ పుట ఆమోదించబడ్డది
దాసర్లు:

తెలంగాణా లోని దాసర్లు సర్కాంధ్రలో దాసర్లు కారు. సర్కారాంధ్రలో బిక్షమెత్తె హరిదాసుళ్ళు, వైద్యంచేసే హరిజన దాసర్లూ (దాసుళ్ళు) వున్నారు. తెలంగాణాలోని వారు హరిజనులకు గురువులు. వీరిని మిత్తుల అయ్యవార్లు అంటారు. సర్కారాంధ్రలో వైష్ణవ గురువులకు ఎంత గౌరవం వుండేదో, ఈ మిత్తుల అయ్యవార్లకు తెలంగాణా హరిదాసుల్లో అంత గౌరవం వుంది.

వీరు కేవలం గురువులే కాక, వీరిలో చాలమంది కళాకారులు కూడా. వీరు వీథి నాటకాలు ఆడతారు. వీరి ముఖ్య నాటకం గరుడాచలం. వీరి వద్ద ఒక విధమైన తంబురా వుంటుంది.

దాన్నిసన్నని గజ్జెలతో వాయిస్తారు. దాని నుండి తంబురా ధ్వనే కాకుండా, మృదంగ ద్వని కూడ వస్తుంది. వీరిలో కొంతమంది సాంప్రదాయక యక్షగానాన్ని కూడా ప్రదర్శిస్తారు.


పీర్ల పండుగలో పేరెన్నికగన్న ధులా

ధులా అనే కళారూపం, సర్కారు ఆంధ్రదేశంలో కానీ, రాయలసీమ ప్రాంతంలో కాని ఎక్కడా కనిపించకపోయినా, తెలంగాణా ప్రాంతంలో మాత్రం అధిక ప్రచారంలో వుంది.

ఇది ముఖ్యంగా శ్రమ జీవుల కళారూపమనీ, అంతకంటే ముఖ్యంగా ముస్లింలు జరుపుకునే పీర్ల పండగకు సంబంధించిందనీ, జయధీర్ తిరుమల రావు గారు ప్రజా కళారూపాలు అనే తమ గ్రంథంలో వివరించారు.

ఇది శ్రమజీవుల కళారూపమైనా శ్రమజీవులందరూ ఈ కళారూపంలో పాల్గొన్నట్లు మనకు పెద్ద అధారాలు లేవు. ఇది అందరూ కలిసి సామూహిక నృత్యం చేస్తారు. పాటకు, పాటకు సంబంధించిన ఆటకూ సంబంధించిన జానపద కళారూపం.

ధులా కళారూపానికి సంబంధించిన పాటల్లో గానీ, పదాల్లో గానీ అవి అతి చిన్నవిగానూ, అంత కంటే కథావస్తువు అతి చిన్నదిగానూ వుంటుంది.

ముఖ్యంగా మొహరం పండుగల్లో జరిగే పీర్ల పండుగల్లో ధులా ఎక్కువ ప్రచారమైనా, ఆ కళారూపాన్ని తెలంగాణా పోరాట సమయంలో సాయుధ దళాల్లో వున్న ముస్లిం సహోదరులూ, ఇతర శ్రమజీవులూ కూడా ఈ కళారూపాన్ని బాగా