పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/720

ఈ పుట ఆమోదించబడ్డది

క్రైస్తవ బుర్ర కథలు మూడు విధాలుగా వున్నాయి. అవి పాత నిబంధనకు చెందినవి. క్రొత్త నిబంధనకు చెందినవి. క్రైస్తవ భక్తుల చరిత్రకు చెందిన బుర్ర కథలు.

గేరా ప్రేమయ్య వ్రాసిన నెహెమ్యా చరిత్ర, దావీదు విజయము, యేసేపు చరిత్ర, వలుకూరి సత్యానంద వ్రాసిన ఎలీషా, చిన్నా బత్తిన మైకేల్ వ్రాసిన "వీర సంపోను చరిత్ర" మొదలగునవి పాత నిబంధనకు సంబందించిన బుర్రకథలు.

పలుకూరి సత్యానందం వ్రాసిన యేసు జన్మము, గేరా ప్రేమయ్య తప్పి పోయిన కుమారుని చరిత్ర, యోహాను శిరచ్ఛేదము, క్రీస్తు శ్రమ మరణ పునరుత్థానముల కథ, సాధు తోమాస్ సుబ్బయ్య వ్రాసిన మృత్యంజయుడు మొదలైనవి కొత్త నిబంధనకు చెందిన బుర్ర కథలు.

గేరా ప్రేమయ్య గారి సాధు సుందరసింగ్, పండిత రామాబాయి, చిన్నాబత్తిని మైకేల్ కవి గారి బ్రదర్ జోసఫ్ తంబి గారి చరిత్ర. స్లీవశ్రీ వ్రాసిన "ఆగ్నేసమ్మ చరిత్ర" సాధుతోమాస్ సుబ్బయ్య వ్రాసిన విశ్వజనని మానవుల మాత మొదలైన భక్తుల చరిత్రకు చెందిన బుర్ర కథలు.

బుర్ర కథల్లో ప్రజా సమస్యలు:

క్రైస్థవ కథలు ప్రాచీనమైనవి. వీటిని ఈనాడు కొందరు బుర్రకథలుగా మలిచారు. అందులో ఈనాటి సమాజంలోని కుళ్ళును చెప్పడానికి ప్రయత్నించారు.