పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/719

ఈ పుట ఆమోదించబడ్డది

వింత దేవుడని సంతరించుచు
ఎగురుచు పాడండి - ఏసుని ఎదలో నుంచండి
సొగసుగ సభలో శుభముల నొసగు
తగిన విధంబున దయ జూపును అని

ఈ విధంగా కోలాటం ద్వారా తాము వివరించా లనుకున్న భావాన్ని వ్వక్తం చేస్తారు.

ప్రజల నుర్రూత లూగించే కళారూపాలలో బుర్రకథ కళారూప ప్రధానమైంది. బుర్రకథను గురించి ఆంధ్ర దేశంలో తెలియని వారెవరూ లేరు. అలాంటి బుర్ర కథను క్రైస్తవులు కూడా వారి మత ప్రచారం కోసం వినియోగించారు. బుర్రకథ లక్షణాలను గురించి గేరా ప్రేమయ్య అనే బుర్రకథా రచయిత "తన పండిత రామాబాయి" అనే బుర్రకథలో ఇలా ఉదహరించాడు.

రగడ

ఘనకవి పండిత సుజనుల్లారా తందాన తాన
తోడు వంతలు జోరుగ పాడ తందాన తాన
జోడు గుమ్మెట్లు తధిమి యనంగ తందాన తాన
రాగ తాళ గీతాది నృత్యముల తంబుర కథ నేడు వినుడీ

అని వివరించాడు.

క్రైస్తవ బుర్రకథా రచయితల్లో గేరా ప్రేమయ్య పేర్కొనతగినవాడు. ఆయన నలబై బుర్రకథల్ని రచించాడు. ఇంకా చిన్నా బత్తిని మైకేల్ కవి, జొన్న కూటి ప్రకాశం, వలుకూరి సత్యానందం, ఈదుల మూడి ఐజాక్, తోట శౌరి మొదలైన వారు రచయితలుగా కథకులుగా పేరు పొందారు.

బుర్ర కథలు:

అలాగే సి. బెనర్జీ, ధర్మయ్య, మస్తాన్ రావు, సత్యం బృందం, రెవరెండ్. కె.ఎస్.ప్రకాశ రావు, గంగోలు మోజెస్, తలతోటి ఏసేపు, బుద్దాడ జోసప్, సి.హె.పాలస్, పి. ఐజక్, సాధు తోమాస్ సుబ్బయ్య, వి. రత్నం., బి. జాన్ మొదలైన వారు బుర్రకథలు చెపుతూ తమ జీవితాలను సాగిస్తున్నారు.