పద్యం:
గుడగుడ రోజు నడకుండకు బాపడు పిచ్చు గుంట్ల, యో
కడు సెప్పినన్ని గోతరలు, గట్టిన జెప్పినామే సమంగుగా
పడిగొని సంపసాచి దలపట్టుకసిందు పదాలు పాడు
గుడగుడ వట్టి లొట్టయని కూయును ముర్ఖుడా.. ॥చంద్ర శేఖరా॥
అని వర్ణించాడు. పిచ్చుకుంటుల వారు ప్రధమంలో కాపుల గోత్రాలనూ, యాదవుల గోత్రాలనూ చెపుతూ వుండేవారు. కాలక్రమాన కమ్మవారి గోత్రాలతో పాటు ఇతర కులాల వారి గోత్రాలను కూడ చెపుతూ వుండేవారు. అలా వారి వారి గోత్రాలను కూడా చెపుతూ వారినే యాచించే వారు. వీరికి పౌరోహితులు జంగాలు.
పిచ్చికుంటులవారు తెలంగాణా జిల్లాలలో ఎక్కువగా వున్నారు. వీరిలో గంట - తురుక - మంద - తిత్తి - తొగరు మొదలైన ఉప జాతులు ఉన్నాయనీ, పన్నెండు తెగల వారు తెలంగాణాలో వున్నారనీ, ఒక తెగవారు సర్కాంధ్ర దేశంలో వున్నారనీ, ఈనాడు తెలంగాణాలో రెడ్లుగా వున్న వారు ఒకప్పుడు కాపులకు సంబంధించిన కోటి గోత్రాలనూ, కోస్తా జిల్లాలలో వున్న కమ్మ వారికి కోటి గోత్రాలనూ చెప్పి యాచించే వారనీ డా॥ బి. రామరాజుగారు వారి జానపద సాహిత్య గ్రంథంలో ఉదహరించారు.
- వారు చెప్పే కథలు:
తెలంగాణా లోని పిచ్చు కుంటుల వారు రాములమ్మ, బాలనాగమ్మ, కామమ్మ, సదాశివరెడ్డి, పర్వతాల మల్లారెడ్డి, సూర్యచంద్ర రాజులు, హరిశ్చంద్రుడు మొదలైన కథలను చెపుతున్నారు.
ఇల రాయలసీమలో నున్న పిచ్చుకుంటుల వారు కుంతి మల్లారెడ్డి కథను గానం చేస్తారు. నెల్లూరు, గుంటూరు ప్రాంతాల్లో పలనాటి వీరగాథల్నీ, కాటమరాజు కథల్నీ గానం చేస్తూ వుంటారు.