అందరికీ ఆశలు రేపే బుడబుక్కల జోస్యం
తెలుగువారి జానపద కళారూపాలలో అనాది నుంచి పగటి వేషాలు ఆంధ్ర ప్రజానీకానికి వినోదంతో పాటు విజ్ఞానాన్ని ప్రసాదించాయి. ముఖ్యంగా ఈ కళారూపాల ఆశయం ఆనాటి సమాజంలోని సంఘ దురాచారాలనూ, అవినీతినీ సునిసితమైన హాస్యంతో దుయ్య బట్టి, తద్వారా ప్రజలకు కనువిప్పు కలిగించి సమాజానికి ఒక నూతన మార్గం సూచించేవి. అలాంటి కళారూపాలలో ముఖ్యమైనది బుడబుక్కల వేషం. సాంప్రదాయంగా వచ్చే ఈ కళారూపాన్ని పగటి వేషధారులు సమాజశ్రేయస్సును జోడించి ప్రదర్శిస్తున్నారు.
- సంప్రదాయ బుడబుక్కలవారు:
బుడబుక్కల జాతివారి ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇతర కులాల వారు పగలు భిక్షాటన చేస్తే, వీరు రాత్రి సమయంలో యాచన సాగిస్తారు. ఇలా సాగించే వారిలో ముఖ్యులు__ బొందిలీలు, భరత సాయిబులు, గంట సాయిబులు, రేయి తురక సాయిబులు , నిడకలోళ్ళని ఇలా ఒకో ప్రాంతంలో ఒకో పేరుతో వ్వవహరించబడుతున్న వీరు రాత్రి పన్నెండు గంటలు దాటిన తరువాత నుంచి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు భిక్షాటన చేస్తారు. ఆ సమయంలో ఒక చేతిలో లాంతరు పట్తుకుని, మరో చేతిలో డమరుకం బుడబుక్కను లబ్జుగా వాయిస్తూ రెండు కాళ్ళ నడుమ ఒక గంటను కట్టుకుని... ఒక దాని మీద ఒకటి నాలుగు జతల బట్టలను తొడిగి, పెద్ద తలగుడ్డ ధరించి, ముఖానికి పెద్ద కుంకుమ బొట్టు పెట్టి, గుబురుగా పెంచిన మీసాలతో, భుజం మీద ఒక పెద్ద జంపకానా ధరించి, వీథిలో గంభీరంగా నడుస్తూ