పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/673

ఈ పుట ఆమోదించబడ్డది

అలాగే తెలుగు జాతిని భక్తితో ప్రభావితం చేసిన గ్రంథాలు మూడు. అవి రామయణ, భారత, భాగవతాలు. ఈ పురాణ గ్రంథాల నుండి ఆయా ఘట్టాలకు సంబంధించిన గేయాలను చెక్క భజనకు ఎన్నుకున్నారు. అలాంటి వాటిలో శ్రీకృష్ణ గొల్లభామల సంవాదం చూడండి.

గొల్ల కృష్ణుడూ, గొల్ల భామలూ:

గొల్లభామలు:__రామ రామ అనంత కాలం రాజ్య మేలుతు వుండర కిష్టా చీరలిచ్చి చెట్లు దిగిరా ఓ గోపాలకిష్టా , చీరలిచ్చి చెట్టు దిగిరా.

కృష్ణుడు:__ఏయ్. రామ రామ అనంత కాలం రాజ్యమేలుతూ వుండనే భామా __ చీరలివ్వనే చెట్లు దగనే ఓ భామలార చీరలివ్వనే చెట్టు దిగనే.

గొల్లభామలు:__వందనాలు నీకు పెడ్తాం చీరలిచ్చి చెట్లు దిగరా గోపాలకిట్నా చీరలిచ్చి చెట్లు దిగరా.

కృష్ణుడు:__వందనాలు నాకు వద్దు దండాలు నాకు వద్దు చీరాలివ్వను చెట్లు దిగానే ఓ బామలార చీర లివ్వను చెట్లు దీగానే.

అంటూ గోపికలు బ్రతిమాలడటం, కృష్ణుడు బెట్టు చేయడం ఆసక్తి కరంగా సాగుతుంది. అలాగే ఉద్ది అడుగులో శ్రీకృష్ణ లీలల్నీ గేయాలలో, గేయ రూపకంగా రామాయణ ఘట్టాల్నీ గంటల కొద్దీ చెక్కభజన రూపంలో వివరిస్తారు. రామాయణంలో వచ్చే ఆయా పాత్రలను దళ సభ్యులు బృందం మధ్యలో కొచ్చి ఆ పాత్రను విర్వహించి మళ్ళీ బృందంలో కలిసి పోతారు.

నీతి పాటలు:

పై విధంగానే నీతి పాటల్ని కూడ పాడతారు. వాటిలో ఆవు పులి కథ అందరికీ తెలిసిందే, అలాంటి గేయంలో తల్లి బిడ్దకు చెప్పే నీతులు, ఆకలి అని అడిగే వారిని అబద్ధం చెప్ప కూడదు అనే నీతిని జానపదులు ఎలా కవితలల్లారో ఈ పాటల్లో తెలుస్తుంది.