అడుగు పొడుగైన చెక్కల్ని తయారు చేసుకుని, రెండు ప్రక్కలా ధ్వని రావడానికి గుండ్రటి ఇనుప బిళ్ళలను గాని, ఇత్తడి బిళ్ళలను గానీ రెండేసి చొప్పున అమర్చుతారు. తాళం ప్రకారం చెక్కలను కొట్టేటప్పుడు ఈ బిళ్ళలు శ్రావ్వమైన ధ్వనినిస్తాయి. అన్ని చెక్కలూ ప్రయోగించినప్పుడు ఈ ధ్వని గంభీరంగా ఒకే శ్రుతిలో వినిపించి భజనపరుల్ని ఉత్సాహపరుస్తాయి. ఈ చెక్కలపై నగిషీలు చెక్కి సుందరంగా వుంటాయి. ఈ బృందలలో కథా వృత్తాన్ని బట్తి కొందరు పురుషులుగానూ, మరి కొందరు స్త్రీ పాత్ర ధారులుగానూ ప్రవర్తిస్తారు. ఉదాహరణకు గోపికా క్రీడల్లో పురుషులు కృష్ణులు గానూ, స్త్రీలు గోపికలు గానూ నర్తిస్తారు.
- రంగుల రంగుల వేషధారణ:
అందరూ ఒకే రంగు గల తల గుడ్డలను, అందంగా చుడతారు. ఒక ప్రక్క రిబ్బను కుచ్చులాగా అందంగా వ్రేలాడుతుంది. పంచెల్ని నృత్యానికి అడ్డు తగలకుండా ఎగరటానికి వీలుగా వుండే లాగా సైకిల్ కట్టులాగా
మడిచి కడతారు. పురుషులు ఒకే రంగు గల బనియన్ లను ధరింస్తారు. స్త్రీ పాత్రలకు లంగా, రవికె, పవిటెకు ఓణీ లాగా గుడ్దను ఉపయోగిస్తారు. ఈ బృందాలలో ఇరవై మొదలు ముప్పై వరకూ సమసంఖ్యలో బృంద సభ్యులుంటారు. పన్నెండు సంవత్సరాల నుంచి పాతిక సంవత్సరాల వయస్సుకల యువకులందరూ పాల్గొంటారు. చెక్క భజన వ్యాయామంతో కూడుకున్న కళారూపం. ఇందుకు తట్టుకోగల యువకులే పాల్గొంటారు. ఒక్కొక్క బృందం తయారవాలంటే మూడు మాసాల కాలం పడుతుంది. అప్పటికి గానీ, చెక్క భజన బృందానికి పరిపక్వత రాదు.
- ఓర్పు, నేర్పు:
చెక్క భజన ప్రారంభ సమయంలో గురువు చాల శ్రమ పడాల్సి వుంటుండి. ప్రతివారూ ఎలా నిలబడాలి? ఒక్కొక్కరికీ ప్రతి భంగిమనూ వివరిస్తూ వలయాకారంగా ప్రతి ఒక్కరిచేతా చేయిస్తాడు. ఇదే ప్రాథమిక దశ. ఈ దశను దాటిన తరువాత,