పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/659

ఈ పుట ఆమోదించబడ్డది

శారదకాండ్రు

శారదకాండ్రు అనే వారు ఒక్క తెలంగాణాలో తప్పా కోస్తా ఆంధ్రదేశంలోనూ, రాయలసీమలోనూ ఎక్కడా కనిపించరు. అయితే తెలంగాణాలో కూడా ఒక్క వరంగల్ తాలూకా లోనే వీరు ఎక్కువ మంది వున్నారు.

నిజానికి బుర్రకథ వాయిద్యాలకూ, శారద కథకుల వాయిద్యానికీ పెద్ద వ్వత్యాసం ఎమీ కనిపించదు. బుర్రకథలో మాదిరే వీరూ డక్కీలు ఉపయోగిస్తారు. వీరు ఉపయోగించే తంబురానే శారద అంటారు. అందు వల్ల వీరికి శారదకాండ్రు అనే పేరు వచ్చింది.

అసలు వీరెవరు?

మున్నూరు, ముతరాసి మొదలైన తెలుగు కులాల నుంచి పుట్టిన ఒక జాతి ఈ శారదకాండ్రనీ భిక్షక జాతుల్లో వీరే ఎక్కువ మంది వున్నారనీ పూర్వం ఈ జాతికి వారికి ఎటువంటి పేరుండేదో తెలియజెప్ప చారిత్రకాధారాలు ఏమీ లేవనీ, వీరికి పేరు ఇటీవలే వచ్చి వుండ వచ్చుననీ, ముఖ్యంగా జానపద గేయాల్లో శారద పాటలు పాడేవారు. ఈ జాతి వారే పాడుతున్నారనీ, ఇతర జానపద గేయాలలో కంటే, ఈ శారద పాటల్లోనే సాహిత్య ప్రతిభ అధికంగా వుంటుందనీ,

ఓ భారతీ కరుణామతి
భళి శారద కరుణానిధి

అనే వంత పాటలు పాడటం వల్ల, వీరికీ పేరు వచ్చిందేమో తెలియదనీ, డా॥ రామ రాజు గారు, తమ గేయ సాహిత్యంలో ఉదహరించారు.;

శారదంటే:

శారదను భుజంమీద ధరించిన కథకుడు__ ఎడమ చేతి బొటన వ్రేలుకు ఆందెలు ధరించి, భుజంపైన తంబురాను కుడిచేతితో మీటుతాడు. దీనినే వారు