పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/65

ఈ పుట ఆమోదించబడ్డది

నట్లు అనేక శాసాల వల్లనూ, ఆనాటి శిల్పకళ వల్లనూ, సాహిత్యం వల్లనూ విదితమౌతోంది.

కళాకారులకు ఘన సత్కారాలు:

దేవాలయ కైకర్యం చేశే నర్తకీ మణులకు, మృదంగ విద్వాసులకు, గాయకులకూ, గృహదానాలు చేసినట్లు పిల్లమఱ్ఱి శాసనంలో ఉదహరించ బడింది.

పానుగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుంది. ధర్మ సాగర శాసనంలో 'జలజకరండ' మనే అపూర్వమైన వాద్య ప్రశంస వుంది. ఈ కరండ వాద్యకారులకూ పది మంది, నాట్య కత్తెలకూ కొన్ని నివర్తనాల బూమిని ఇచ్చినట్లు వ్రాయబడివుంది.

చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి దేవుడు నృత్తరత్నావళి రచయిత జాయప సేనాని పదహారు మంది ఆటకత్తెలకు గృహ దానాలు చేసినట్లుంది.

మాన్యాలు, సమ్మానాలు:

గుంటూరుజి ల్లా, గుంటూరు తాలూకా, మంచారమనే (నేటి మందడం) మల్కాపురం శాసనంలో 1183 లో కాకతీయ మహారాణీ రుద్రమదేవి విశ్వేశ్వర శివాచార్యుడు స్థాపించిన గోళకీమత విద్యాస్థానానికి దేవాలయంలో పదిమంది నర్తకులకూ, ఎనిమిది మంది మార్దంగికులలూ, కాశ్మీరు గాయకునికీ, పద్నాలుగురు గాయనీ మణులకూ, కరడా వాద్యంలో ఆరితేరిన కళాకారులు ఆరుగురికీ, వృత్తి మాన్యాలిచ్చి నాట్య సంగీతాలకు పోషణ కల్పించినట్లుంది.

శాసనాలతో పాటు కాకతీయ చక్రవర్తులు కట్టించిన అనేక దేవాలయాలమీద నాట్య సాంప్రదాయలను ప్రతిబింబించే అనేక నాట్య శిల్పాలున్నాయి. అనేక దేవాలయాలు, శిల్పాలు తురుష్కుల దండ యాత్రల్లో చిన్నాభిన్నమైనాయి.