అవసరం. బొమ్మ పూర్తిగా తయారవడానికి నెల రోజులు సమయం పడుతుంది. చింత గింజలను నానబెట్టి, ఉడికించి, గుజ్జు తయారుచేస్తారు. వెదురుతో తయారు చేసిన ఆకారానికి గుజ్జు పులిమి అది అరాక రంగులు తీర్చి దిద్దుతారు. ఒక బొమ్మ తయారీకి వెయ్యి రూపాయల పెట్టుబడి అవసరం. ప్రదర్శనలు లేని సమయంలో, బొమ్మల పరిరక్షణకు ఎంతో శ్రద్ధ వహించాల్సి వుంటుండి. కలరా వుండలు (నెప్తిలిన్ బాల్సు) ఎలుకల మందులు వేసి గుడ్డలు చుట్టి భద్ర పరుస్తారు.
- ప్రదర్శన రక్తి:
బుట్ట బొమ్మల ప్రదర్శనాన్ని రక్తి కట్టించాలంటే కనీసం పది మంది కళాకారులైనా వుండాలంటారు సూర్యనారాయణ గారు. వీరిలో బొమ్మలను తయారు చేసేవారు కొందరైతే, వాయిద్యాలు వాయించేవారు కొందరు. దేవతా మూర్తుల బొమ్మలతో జరిగే ప్రదర్శన అత్యద్భుతంగా వుంటుంది.
ముఖ్యంగా ఈ బొమ్మలు పెద్ద వాళ్ళతో పాటు పిల్లల్నికూడ ఎంతగానో ఆకర్షిస్తాయి. జనం మధ్యలో అవి ఎంతో ఆకర్షవంతంగా చూడముచ్చటగా పుంటాయి. ప్రణయ విలాసాలూ, ప్రణయ కలహాలూ చివరికి సుఖాంతాలూ, యవ్వనంలో వున్న యువతీ యువకుల్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. మధ్య మధ్య వచ్చే సింగీ సింగడు లాంటి హాస్య బొమ్మలు లాంటివి పిల్లల్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. బుట్ట బొమ్మలను మనుషులే ఆడించినా, బొమ్మలే మనుషుల్లాగా ఆడుతున్నాయనే భ్రమను కలిగిస్తాయి. ఉత్సవ సమయాల్లోనూ, పెళ్ళిళ్ళ సమయాల్లోనూ వివిధ రకాలైన వినోదాలకు ఎటువంటి అవకాశాన్నిస్తారో ఈ బుట్ట బొమ్మలకు కూడా అంతటి ప్రాముఖ్యాన్నిస్తారు. రాష్ట్ర వ్వాప్తంగా ఈ బొమ్మలను ఆడించే కళాకారులు ఇరవై అయిదు మంది వరకూ వున్నారు. సూర్య నారాయణ గారు రాష్ట్రంలోనే కాక ఢిల్లీలో కూడ ప్రదర్శన లిచ్చారు. ప్రభుత్వం జరిపిన అప్నా ఉత్సవంలోనూ, రిపబ్లిక్ ఉత్సవం లోనూ కూడా మన బుట్ట బొమ్మలు ప్రదర్శించబడ్డాయి. బుట్ట బొమ్మలు ఈ నాటికీ ఆడించతగినవే.