పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/641

ఈ పుట ఆమోదించబడ్డది

సమూహం ఒకరిపై మరొకరు పరిమళ ద్రవాలను రంగులతో కలిసి వసంతాన్ని చల్లుకొని వావి వరుసలు లేకుండా తటాకంలో దిగి జల క్రీడలతో విహరించేవారు.

కళాకారులకు, ఘన సత్కారం:

ఆ తరువాత మహారాజు.... నిండు కొలువులో గాయకులకు, శిల్పులకు, నట్టువరాండ్రకు, నటీ నటులకు బహుమానాలను సమర్పించి, పండితులను వేద పఠనాల మధ్య సన్మానించి, ఆనాటి రాత్రంతా...జాగారం చేసేవాడు. నాటక ప్రదర్సనాలతోనూ సంగీత నృత్యాలతోనూ తెల్లారేది.

రెడ్డిరాజుల్లో ఆనవేమారెడ్డి, ప్రప్రథమంగా ఈ వసంతోత్సవాలను ప్రవేశపెట్టాడు. ఆనాటి నుండి రెడ్డి సామ్రాజ్యంలో వసంతోత్సవాలు వైభవోపేతంగా జరుగుతూ వుండేవి. ఆ మహోత్సవ సమయాలలో కర్పూరాది పరిమళ ద్రవ్వాలను వెదజల్లడం వలన అనవేమారెడ్డి, కుమారగిరి రెడ్డి రాజులకు, వసంత రాయ, కర్పూర వసంత రాయ బిరుదులు కలిగాయి; రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవాలు, జాతీయ వుత్సవాలుగా జరిగేవి. విజయనగర రాజుల కాలంలో కూడా ఈ వసంతోత్సవాలు, ముమ్మరంగా జరుగుతూ వుండేవి.


ఘటనృత్యం


ఆంధ్రదేశపు జానపద నృత్యాలలో ఈ ఘటనృత్యం ఒకటి. ఇతర నృత్యాలవలె ఎప్పుడు పడితే అప్పుడు ప్రదర్శించే నృత్యం కాదిది. ఏ పర్వదినాల్లోనూ ఈ నృత్యాలు జరగవు. ఒక్క జాతర్ల సందర్భాలలో తప్పా మారెప్పుడూ ఈ ఘటనృత్యాలు జరగవు.

గరగల సంప్రదాయానికీ, ఘటానికీ దగ్గర సంబంధమున్నా రెంటికీ కొంత వరకు వ్వత్యాసం వుంది. కృష్ణా గుంటూరు జిల్లాలలో ఒకప్పుడు విరివిగా వాడుకలో వుండేవి. జాతర్లూ, జంతు బలులూ తగ్గిన తరువాత ఈ ఘట నృత్యాలు కూడ తగ్గిపోయాయి. ఆంధ్ర దేశంలో ఆనాది నుంచీ ప్రదర్శింపబడే ఈ నృత్యం జాతర్ల సందర్భంలో ప్రదర్శిస్తారు. పల్లెల్లో పశువులకు జాడ్యాలు వచ్చినప్పుడు, కలరా, మశుచికం వ్వాపించి నప్పుడు దేవతలకు ముడుపులు కట్టి మ్రొక్కుతారు. ఇలా మ్రొక్కిన కొన్ని దినాలకు గ్రామంలో ఇంటింటికి చందాలు వసూలు చేసి గ్రామ మధ్యలో దేవతల విగ్రహాలను ప్రతిష్టించి ఒక నెల రోజులు పంబల కథలతో సాధులతో