పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/640

ఈ పుట ఆమోదించబడ్డది
కప్పాలూ, కానుకలు:

ఈ విధంగా ప్రారంభమైన వసంతోత్సవంతో వారి వారి విద్యల్ని ప్రదర్శించి పారి తోషికాలు పొందటానికి నటీనటులు, శిల్పులు, చిత్రకారులు, సంగీత విద్వాంసులు మొదలైన అనేక మంది కళాకారులు హాజరయ్యేవారు. రాజ్యం నలుమూలల నుంచీ ఈ వసంతోత్సవాలను తిలకించడానికి ఆబాల గోపాలం కదలి వచ్చేది. ఆ నాటి వసంతోత్సవాలు రాజుకు, ప్రజలకు పండుగగా మారింది.

ఉత్సవం ఈ విధంగా సాగుతూ వుండగా రాజుకు, సామంత రాజులూ,

మండలేశ్వరులూ మొదలైన వారు కానుకలనూ, కప్పాలనూ ఈ సందార్భంలో చెల్లించే వారు. విదూషకులు వినోదగోష్టి జరిపేవారు. రాజు వెంట వచ్చిన సుందరీ మణులు వనంలో ఉయ్యాలలూగుతూ, ఏలపాటలతోనూ, జాజర పాటల తోనూ కాలక్షేపం చేసేవారు. రాజు రాజులతో కలిసి; మన్మథునీ, తదితర దేవతలనూ పూజించి బ్రాహ్మణ దంపతులకు కర్పూర తాంబూలాలను సమర్పించేవారు.

రంగుల వసంతం:

తరువాత రాజు చందనాది సుగంద ద్రవ్వాలనూ, కర్పూర నీరాజనాలనూ వినోద ప్రారంభానికి చిహ్నంగా జన సమూహంపై చల్లేవాడు. ఆ తరువాత జన