పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/631

ఈ పుట ఆమోదించబడ్డది

హరిజనులు, యానాదులు, జంగాలు, బలిజలు, గొల్లలు, రెడ్లు మొదలైన అనేక కులాలవారు రోజుల తరబడి ఈ ప్రదర్శనాలను ప్రదర్శిస్తూ వుంటారు. అంతే కాదు అన్యమతస్తులైన క్రిష్టియన్లూ, ముస్లిములూ మహాభారత నాటకాల్లో నటించటమే కాక అనేక వీథి భాగవత దళాలకు శిక్షణ ఇచ్చే గురువులుగా కూడా వున్నారంటే, ఇంతకంటే మాత సామరస్యానికి దాఖలా ఏం కావాలి. సాంస్కృతిక ప్రదర్శనాలు జాతీయ సమైకత్యను ఎలా పెంపొందిస్తున్నాయో తెలుసుకోవచ్చు.

ఇవి యక్షగాన వీథి నాటకాలు:

చిత్తూరు జిల్లాలో ప్రదర్శించే వీథి నాటకాల శిల్పం యక్షగాన రీతికి చెందింది. ఇందులో కుప్పం ప్రాంతంలోని 'కంగుంది సంస్థానం' లో వెల్లివిరిసిన 'కంగుంది బాణీ' అనేది చిత్తూరు యక్షగాన నాటకాల ప్రత్యేకత. అయితే చిత్తూరు జిల్లా తూర్పు ప్రాంతంలో 'సంత వేలూరు బాణీ' కి ఎక్కువ ప్రత్యేకత వుంది. ముఖ్యంగా వీరు రామ నాటకాలను ఎక్కువ ఆడతారు. అందులో కుశలవుల నాటకం ఎంతో ప్రాముఖ్యం వహించింది.

చిత్తూరు జిల్లాలోని ఈ భారత నాటక ప్రదర్శనం కేవలం స్టేజికి మాత్రమే పరిమితం కాకుండా, రంగస్థల స్థాయినీ, నటుల స్థాయినీ దాటి ఊరందరూ పాల్గొనే సమిష్టి రంగ స్థలంగా మారి పోతుంది. ఉదాహరణకు "బకాసుర వధ" ఘట్టంలో భీముడి పాత్ర ధారి, రంగాన్ని వదిలేసి, నిజంగా ఓ బండి మీద ఊళ్ళోకి బయలు దేరి గడప గడపకూ బోణాల్ని స్వీకరించి, రాక్షస వధానంతరం 'సమిష్టి బంతి' జరపడం విశేషం.

తపస్మాన్:

ఈ సందర్భంలో ... అర్జునుడు దివ్యాస్త్రాల కోసం చేసే తపస్సుకు ప్రతీకగా నిలబెట్టిన ఒక స్థంభాన్ని ఎక్కుతాడు. ఆర్జున పాత్రధారి మెట్టు మెట్టుకూ ఎక్కుతూ నాటకీయంగా పద్యం పాడుతూ అధిగమిస్తాడు. తపస్సుకు వీలుగా మాను పైన