పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/629

ఈ పుట ఆమోదించబడ్డది
శివుని బిడ్డవమ్మా ఎల్లమ్మ:

శివుని చిన్న బిడ్డవమ్మా ఎల్లమ్మ,
నీవు శివువెల్లి మాతవమ్మా ఎల్లమ్మ,
పుట్టలో పుట్టినావు ఎల్లమ్మా,
నీవు పుడమిపై బడ్డావమ్మ ఎల్లమ్మ.
నాగవనన్నె చీరలమ్మ ఎల్లమ్మ నీకు.,
నీకు నెమలి కండ్ల రవికెలమ్మ ఎల్లమ్మ.
ఎదుము గల్వాలు తల్లీ ఎల్లమ్మ నీకు
ఎనుక నీకు దరిసెనమ్మ ఎల్లమ్మ
గవ్వలాది కంకణమ్ము ఎల్లమ్మానీకు
ఘంటలాది రాగమమ్మా ఎల్లమ్మా
నాగుబాముల బట్టినావూ ఎల్లమ్మా నీవు
నడికట్టు వేసినావు ఎల్లమ్మా
జెఱ్ఱిపోతుల బట్టినావూ ఎల్లమ్మా నీవు
జడికొప్పులు వేసినావు ఎల్లమ్మా
కాలి గజ్జెలు గల్లు మనిపిస్తే ఎల్లమ్మ నీవు.
ఓరుగల్లు తల్లడిల్లే ఎల్లమ్మా
ఓరుగంటి రాజులకు ఎల్లమ్మా నీవు
ఓంకారమడిగితివి ఎల్లమ్మా.

ఎల్లు ఎల్లు ఎల్లమ్మా ఎల్లమ్మా నీవు.
ఎల్లు నీవు ఎదురైనచో ఎల్లమ్మా

తల్లి ఎవరమ్మా, ఎల్లమ్మా|